భోజనం చేశాక రెండు యాలకులు నోట్లో వేసుకుంటే చాలు..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

భోజనం తర్వాత ఏలకులు నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అవి గ్యాస్ట్రబిలిటీ, అపానవాయువు వంటి సమస్యలను పరిష్కరించడంలో,ఎసిడిటీని నివారించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. గ్లూకోజ్ కొవ్వుగా నిల్వ చేయబడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండే ఏలకులు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.

Jyothi Gadda

|

Updated on: Jul 02, 2024 | 11:37 AM

పీరియడ్స్‌ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, కండరాల తిమ్మిరితో బాధపడే వారికి యాలకుల నీరు చాలా మేలు చేస్తుంది. యాలకుల నీటిలో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యత నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

1 / 5
వర్షాకాలంలో దగ్గు, ముక్కు కారటం, గొంతు నొప్పితో బాధపడుతుంటే యాలకులు టీ తాగడం మంచిది. యాలకులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్ని రకాల గొంతు సంబంధిత సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి. అంతేకాదు ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

2 / 5
జలుబు, దగ్గును దూరం చేస్తాయి. మంచినిద్రకు యాలకులు తోడ్పడుతాయి. భోజనం తర్వాత యాలకులు తింటే బరువు తగ్గుతారు. రక్తపోటు ఎక్కువగా ఉంటే యాలకులు తినాలి. యాలకులు ఎముకలను బలంగా ఉంచుతాయి. యాలకుల్లో పీచు పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో అవసరం. యాలకులను తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.

3 / 5
యాలకులు తీసుకోవడం వల్ల ఆందోళన, డిప్రెషన్ నుండి ఉపశమనం పొందవచ్చు. ఏలకులను నీటిలో వేసి మరిగించి తాగితే మంచిది. దీని వాసన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా, యాలకులలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. అలాగే శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగించి, చర్మానికి మెరుపునిస్తుంది.

4 / 5
పొత్తికడుపులో కొవ్వు పేరుకుపోకుండా ఏలకులు సహాయపడతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన ఏలకులను భోజనం తర్వాత నమలడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి. యాలకులు అధిక బరువును తగ్గిస్తాయి. యాలకుల్లోని వేడి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. ఇందుకోసం రోజూ రాత్రి ఓ యాలకును తినాలి. శరీరంలోని వ్యర్థాలు, హానికర బ్యాక్టీరియా వంటి వాటిని యాలకులు తరిమేస్తాయి.

5 / 5
Follow us