AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moringa Chapati: మునగాకు చపాతీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తయారీ విధానం ఇదీ..

మునగాకు ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యం. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. మునగాకును పోషకాల నిధి అని అంటూ ఉంటారు. ఆయుర్వేదంలో కూడా మునగాకును అనేక సమస్యలు తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. మీ డైట్‌లో ఖచ్చితంగా మునగాకును యాడ్ చేసుకోండి. దీని వల్ల వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. అయితే మునగాకు అంటే పెద్దగా ఎవరికీ ఇష్టం ఉండదు. అలాంటి వారు మునగాకుతో చపాతీ తయారు చేసుకోవచ్చు. మునగాకును చపాతీ ద్వారా తీసుకోవడం..

Moringa Chapati: మునగాకు చపాతీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తయారీ విధానం ఇదీ..
Moringa Chapati
Chinni Enni
| Edited By: |

Updated on: Jul 02, 2024 | 1:10 PM

Share

మునగాకు ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యం. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. మునగాకును పోషకాల నిధి అని అంటూ ఉంటారు. ఆయుర్వేదంలో కూడా మునగాకును అనేక సమస్యలు తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. మీ డైట్‌లో ఖచ్చితంగా మునగాకును యాడ్ చేసుకోండి. దీని వల్ల వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. అయితే మునగాకు అంటే పెద్దగా ఎవరికీ ఇష్టం ఉండదు. అలాంటి వారు మునగాకుతో చపాతీ తయారు చేసుకోవచ్చు. మునగాకును చపాతీ ద్వారా తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మునగాకును తినమని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. కనీసం వారంలో ఒకసారైనా మునగాకు తీసుకోవానికి ట్రై చేయాలి. మరి మునగాకు చపాతీ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మునగాకు చపాతీకి కావాల్సిన పదార్థాలు:

గోధుమ పిండి, మునగాకు, కొత్తి మీర, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, కారం, పసుపు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు, నెయ్యి.

మునగాకు చపాతీ తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలోకి గోధుమ పిండి తీసుకోవాలి. అందులో సన్నగా కట్ చేసిన మునగాకు, కొత్తి మీర, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, కారం, పసుపు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు ఇలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీలా కలుపు కోవడానికి అవసరం అయ్యే నీళ్లు పోసి.. బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిని ఓ గంట లేదా అరగంట సేపు గాలి తగలకుండా పక్కన పెట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకుని చపాతీల్లా చేసుకుని.. పెనంపై వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మునగాకు చపాతీ సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాల మంచిది. మునగాకు అంటే ఇష్టం లేని వారు ఇలా తినవచ్చు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..