Red Guava Benefits: ఎర్ర జామ పండు తింటున్నారా.. అయితే ఈ విషయాలు మీ కోసమే!
మనం తినే ఆహారాల్లో జామ పండు కూడా ఒకటి. జామ కాయలు అన్ని సీజన్ లలో కూడా విరివిగా లభ్యమవుతాయి. పేదోడి యాపిల్ గా జామ పండుకు పేరుంది. యాపిల్ లో ఎలాంటి పోషకాలు ఉంటాయో.. జామ కాయలో కూడా అలాంటి పోషకాలే ఉంటాయి. అయితే యాపిల్ ఖరీదు ఎక్కువ. కానీ జామ కాయలు మాత్రం కాస్త చవగా లభ్యమవుతాయి. అందుకే యాపిల్ తినలేని వారు.. జామ కాయను తింటే సరి పోతుంది. అయితే ఈ జామ కాయల్లో..
మనం తినే ఆహారాల్లో జామ పండు కూడా ఒకటి. జామ కాయలు అన్ని సీజన్ లలో కూడా విరివిగా లభ్యమవుతాయి. పేదోడి యాపిల్ గా జామ పండుకు పేరుంది. యాపిల్ లో ఎలాంటి పోషకాలు ఉంటాయో.. జామ కాయలో కూడా అలాంటి పోషకాలే ఉంటాయి. అయితే యాపిల్ ఖరీదు ఎక్కువ. కానీ జామ కాయలు మాత్రం కాస్త చవగా లభ్యమవుతాయి. అందుకే యాపిల్ తినలేని వారు.. జామ కాయను తింటే సరి పోతుంది. అయితే ఈ జామ కాయల్లో రెండు రకాలు ఉంటాయి. ఒక తెల్ల జామ, రెండోది ఎర్ర జామ. తెల్ల జామ కంటే ఎర్ర జామ కాయలు తింటేనే ఆరోగ్యానికి మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం:
ప్రతి రోజూ ఎర్ర జామ పండ్లను తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. తెల్ల జామతో పోలిస్తే.. ఎర్ర జామ కాయలో పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా చలి కాలం, వర్షా కాలంలో ఎర్ర జామ తింటే సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. శరీరాన్ని బలంగా, దృఢంగా మారుస్తుంది.
చర్మ సమస్యలకు చెక్:
చర్మంపై మచ్చలు, ముడతలు రాకుండా చూస్తుంది. క్రమం తప్పకుండా జామ పండు తింటే చర్మ సమస్యలు దూరం అవుతాయి. చర్మాన్ని కాంతివంతంగా చూస్తుంది.
రోగ నిరోధక శక్తి ఎక్కువ:
తెల్ల జామతో పోలిస్తే ఎర్ర జామలో రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎర్ర జామలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి వ్యాధులు దరి చేరకుండా చూస్తుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు దరి చేరకుండా రక్షణగా నిలుస్తుంది.
మధుమేహం ఉన్న వారు తినొచ్చు:
జామ కాయ నేచురల్ గా స్వీట్ నెర్ కాబట్టి.. డయాబెటీస్ ఉన్న వారు ఈ పండును ఎలాంటి సందేహం లేకుండా తినొచ్చు. అయితే మితంగా తీసుకోవాలి. ఇది తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
పుష్కలంగా ఐరన్:
ఎర్ర జామలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఐరన్ లోపం తలెత్తదు. అంతే కాకుండా రక్త హీనత సమస్య అదుపులోకి వస్తుంది. అలాగే ఎర్ర జామ తినడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.