Pachi Mirchi Pachadi: పచ్చి మిర్చితో ఇలా నిల్వ పచ్చడి చేయండి.. చలికాలంలో భలేగా ఉంటుంది!
వంటల్లో ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో పచ్చి మిర్చి కూడా ఒకటి. సాధారణంగా ఇవి లేకుండా ఏ వంట కూడా పూర్తి కాదు. పచ్చి మిర్చిని తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతే కాకుండా వంటలకు చక్కటి రుచి కూడా వస్తుంది. పచ్చి మిర్చితో వివిధ రకాల పచ్చళ్లు చేస్తారు కానీ.. పచ్చి మిర్చితో నిల్వ పచ్చడి చేసుకోవచ్చన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. పూర్వం ఎక్కువగా ఈ పచ్చడిని చేసే వారు. అన్నం, టిఫిన్స్ లోకి కూడా చాలా బావుంటుంది. ఈ పచ్చడి ఎక్కువగా వర్షాకాలం, చలి కాలంలో..
వంటల్లో ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో పచ్చి మిర్చి కూడా ఒకటి. సాధారణంగా ఇవి లేకుండా ఏ వంట కూడా పూర్తి కాదు. పచ్చి మిర్చిని తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతే కాకుండా వంటలకు చక్కటి రుచి కూడా వస్తుంది. పచ్చి మిర్చితో వివిధ రకాల పచ్చళ్లు చేస్తారు కానీ.. పచ్చి మిర్చితో నిల్వ పచ్చడి చేసుకోవచ్చన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. పూర్వం ఎక్కువగా ఈ పచ్చడిని చేసే వారు. అన్నం, టిఫిన్స్ లోకి కూడా చాలా బావుంటుంది. ఈ పచ్చడి ఎక్కువగా వర్షాకాలం, చలి కాలంలో తింటే ఆరోగ్యంతో పాటు టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈ పచ్చి మిర్చి నిల్వ పచ్చడిని ఎలా తయారు చేస్తారు? తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి మిర్చి నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు:
పచ్చి మిర్చి, నూనె, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, చింత పండు, తాళింపు దినుసులు, ఉప్పు.
పచ్చి మిర్చి నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా పచ్చి మిర్చి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆర బెట్టుకోవాలి. తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని.. అందులో నూనె వేసి వేడెక్కాక.. పచ్చి మిర్చి వేసి ఎర్రగా వేయించు కోవాలి. ఇప్పుడు చింత పండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకుని మరోసారి బాగా వేయించుకుని.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇవి బాగా చల్లారాక.. మిక్సీ జార్ లో వేసుకుని కచ్చా పచ్చాగా రుబ్బు కోవాలి. ఇక తర్వాత కడాయిలో ఆయిల్ వేసి వేడెక్కాక.. తాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు వేసి.. పచ్చడికి తాళింపు పెట్టాలి. దీన్ని గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. ఇది ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. చలి కాలంలో వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి, ఈ పచ్చడి వేసుకుని తింటే భలే టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్ ఈ పచ్చి మిర్చి పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.