Castor Oil Benefits: నులి పురుగులను దూరం చేసే ఆముదం.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు!
ఆయుదం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం కూడా ఆముదాన్ని వివిధ రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. పూర్వం కొబ్బరి నూనెకు ముందు.. ఆముదాన్నే వినియోగించే వారు. ఈ ఆముదాన్ని ఏరండ, పంచాగుల అని కూడా పలు ప్రాంతాల్లో పిలుస్తారు. ఆముదం మొక్కలో ప్రతి భాగం కూడా ఆయుర్వేద గుణాలు..
ఆయుదం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం కూడా ఆముదాన్ని వివిధ రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. పూర్వం కొబ్బరి నూనెకు ముందు.. ఆముదాన్నే వినియోగించే వారు. ఈ ఆముదాన్ని ఏరండ, పంచాగుల అని కూడా పలు ప్రాంతాల్లో పిలుస్తారు. ఆముదం మొక్కలో ప్రతి భాగం కూడా ఆయుర్వేద గుణాలు నిండి ఉంటాయి. ఆముదాల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎర్ర ఆముదం.. మరొకటి తెల్ల ఆముదం. ఈ ఆముదం గింజల నుంచి ఆయి ల్ ను కూడా తీస్తారు. పూర్వీకులు ఎక్కువగా ఈ ఆముదం నూనే వినియోగించేవారు. ఈ ఆముదంతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
నులి పురుగుల నశిస్తాయి:
ఆముదం నూనెతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు నశిస్తాయి. దీని పొట్ట ఫ్రీగా ఉంటుంది. అలాగే ఆకలి కూడా వేస్తుంది. మలబద్ధకం సమస్య తీరుతుంది. చిన్న వారైనా.. పెద్దవారైనా పరగడపును కొద్దిగా ఆముదాన్ని నాకితే.. జీర్ణ సమస్యలు తొలగుతాయి.
మూల వ్యాధులు తగ్గుతాయి:
మూల వ్యాధులతో బాధ పడేవారికి.. ఆముదం మొక్క ఆకులు ఎఫెక్టీవ్ గా పని చేస్తాయి. ఈ వ్యాధితో బాధ పడేవారు ఆకులను నూరి.. కర్పూరం కలిపి కట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి.
జుట్టు సమస్యలు తొలగుతాయి:
ఆముదాన్ని ప్రతి రోజూ తలకు అప్లై చేయడం వల్ల జుట్టు సమస్యలు అన్నీ తగ్గి పోతాయి. అంతే కాకుండా హెయిర్ ఫాల్, చుండ్రు తగ్గి.. జుట్టు పొడుగ్గా, ఒత్తుగా పెరుగుతుంది.
చర్మ సమస్యలకు చెక్:
ఆముదంతో చర్మ సమస్యలను కూడా తగ్గించు కోవచ్చు. ఆముదం నూనెలో ఉండే మైక్రోబయల్ లక్షణాలు చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశనం కలిగిస్తాయి. తరుచుగా చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారు.. ప్రతి రోజూ ఆముదం నూనెను స్కిన్ పై రాసుకుంటే ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
నొప్పులు తగ్గుతాయి:
కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధ పడేవారు.. ప్రతి రోజూ ఈ ఆముదం నూనెను అప్లై చేసి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అంతే కాకుండా ఆముదం ఆకులను వేడి చేసి నొప్పులు ఉన్న చోట కట్టుకుంటే మంచి రిలీఫ్ దొరుకుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.