Menthol Pain Killer: మెఫ్టాల్ పెయిన్ కిల్లర్‌తో జాగ్రత్త.. ఐపీసీ అలర్ట్.! అప్రమత్తమవ్వాలని కేంద్రం సూచన.
ఇటీవల కాలంలో వైద్యులను సంప్రదించకుండానే రకరకాల టాబ్లెట్లు వాడటం పరిపాటిగా మారింది. ఇందులో ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. తాజాగా ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ IPC ఓ అలర్ట్ జారీ చేసింది. నొప్పి నివారణకు ఉపయోగించే మెఫ్తాల్ పెయిన్ కిల్లర్‌తో ప్రతికూల ప్రభావాలు ఉన్నాయని హెచ్చరింది. ఈ ఔషధం వాడకం వల్ల ఈసునోఫీలియా, సిస్టమిక్ సింప్టమ్స్ సిండ్రోమ్.. అంటే తీవ్రమైన అలర్జీ తలెత్తుతోందని పేర్కొంది.
ఇటీవల కాలంలో వైద్యులను సంప్రదించకుండానే రకరకాల టాబ్లెట్లు వాడటం పరిపాటిగా మారింది. ఇందులో ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. తాజాగా ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ IPC ఓ అలర్ట్ జారీ చేసింది. నొప్పి నివారణకు ఉపయోగించే మెఫ్తాల్ పెయిన్ కిల్లర్‌తో ప్రతికూల ప్రభావాలు ఉన్నాయని హెచ్చరింది. ఈ ఔషధం వాడకం వల్ల ఈసునోఫీలియా, సిస్టమిక్ సింప్టమ్స్ సిండ్రోమ్.. అంటే తీవ్రమైన అలర్జీ తలెత్తుతోందని పేర్కొంది. మెఫ్తాల్ ఔషధానికి సంబంధించిన ప్రతికూల ప్రభావాలను గమనించి, అప్రమత్తమవ్వాలని ఆరోగ్యరంగ వృత్తి నిపుణులు, వ్యాధిగ్రస్తులకు కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30వ తేదీన ఒక అడ్వైజరీని జారీ చేసింది. సాధారణంగా రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్, ఆస్టియో ఆర్ర్థరైటిస్, మహిళల్లో నెలసరి సమయంలో సంభవించే డిస్‌మెనోరోయియా, నొప్పి, వాపు, జ్వరం, దంతాల నొప్పి వంటి చికిత్సలో మెఫేనమిక్ యాసిడ్ పెయిన్ కిల్లర్‌ను వినియోగిస్తుంటారు.
ఫార్మకొవిజిలెన్స్ ప్రాగ్రామ్ ఆఫ్ ఇండియా డాటాబేస్‌లోని సమాచారం ఆధారంగా జరిపిన ప్రాథమిక అధ్యయనంలో మెఫనామిక్ యాసిడ్ ప్రతికూల ఫలితాల గురించి వెల్లడైంది. డీఆర్ఈఎస్ఎస్ సిండ్రోమ్ బారిన పడ్డ బాధితుల్లో స్కిన్ రాష్, జ్వరం, లింఫాడినోపతీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఔషధం వాడటం మొదలెట్టిన రెండు నుంచి ఎనిమిది వారాల మధ్య ఈ అలర్జీ లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఈ మందు సూచించాక వైద్యులు రోగుల్లో అలర్జీ సంబంధిత సమస్యలు వస్తున్నాయా? లేదా? అని నిశితంగా గమనించాలని ఐసీపీ సూచించింది. సమస్య తలెత్తినప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.