ఆహారంలో భాగంగా దాదాపు అన్ని ఇళ్లల్లో పెరుగు తింటుంటారు. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ప్రోబయోటిక్స్, ప్రోటీన్, క్యాల్షియం, పేగు ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
పెరుగు ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ దీనిపై చాలా మంది అనేక సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా పెరుగును తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయని చాలా మంది పెరుగును దూరం పెడుతుంటారు
TV9 Telugu
నిజానికి పెరుగు తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు రావని వైద్యులు చెబుతున్నారు. అలాగే పెరుగు ఆమ్లత్వం కలిగిస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ పెరుగు ఆమ్లత్వాన్ని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు
TV9 Telugu
అయితే బాగా పులిసిన పెరుగు మాత్రం కొద్దిగా ఆమ్లత్వం లక్షణాలను ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ రోగులు పెరుగు తీసుకోకూడదని చాలా మంది పెరుగుకు దూరంగా ఉంటారు
TV9 Telugu
పెరుగు తీసుకోవడంపై ఉన్న అపోహల్లో ఇది కూడా ఒకటి. అయితే చక్కెర లేని పెరుగు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది
TV9 Telugu
కనుక చక్కెర లేకుండా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పెరుగును తీసుకోవచ్చు. అదే విధంగా పెరుగు కడుపు ఉబ్బరాన్ని కలిగించదు. లాక్టోజ్ అసహనత ఉన్న వారిలో మాత్రమే పెరుగు కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది
TV9 Telugu
పెరుగు తీసుకోవడంపై ఉన్న అతి పెద్ద అపోహల్లో ఒకటి చేపలతో పెరుగు తీసుకోకూడదని. కానీ ఇది నిజం కాదు. చేపలు, చికెన్, మటన్ వంటి ప్రోటీన్ ఉన్న ఆహారాలతో పెరుగు తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు
TV9 Telugu
అలాగే చాలా మంది బయట ప్యాకెట్ లలో లభించే పెరుగును తింటూ ఉంటారు. కానీ బయట లభించే పెరుగు కంటే ఇంట్లో తాజాగా తయారు చేసుకున్న పెరుగును తీసుకోవడమే మంచిది. రోజుకు సగటున ఒక కప్పు మోతాదులో పెరుగు తీసుకోవచ్చు