AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Muscle Pain: వర్కౌట్ తర్వాత కండరాలు పట్టేస్తున్నాయా?.. ఈ 5 చిట్కాలతో మీ బాడీ వెంటనే రీసెట్ అవుతుంది..

చాలా కాలం తర్వాత వ్యాయామం మొదలుపెట్టినా లేదా అకస్మాత్తుగా వెయిట్స్ పెంచినా.. మరుసటి రోజు శరీరం కదలనంతగా నొప్పి పుడుతుంది. దీనిని మనం సాధారణంగా కండరాలు పట్టేయడం అంటాం. అయితే, ఈ నొప్పి ఎందుకు వస్తుంది? ఇది ప్రమాదకరమా? లేదా మన శరీరం మెరుగుపడుతోందనడానికి సంకేతమా? ఢిల్లీకి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దీపక్ కుమార్ మాటల్లో.. వ్యాయామం తర్వాత వచ్చే ఈ ఆలస్యమైన కండరాల నొప్పి (DOMS) వెనుక ఉన్న అసలు రహస్యాలను తెలుసుకుందాం.

Muscle Pain: వర్కౌట్ తర్వాత కండరాలు పట్టేస్తున్నాయా?.. ఈ 5 చిట్కాలతో మీ బాడీ వెంటనే రీసెట్ అవుతుంది..
Muscle Pain After Exercise
Bhavani
|

Updated on: Mar 03, 2026 | 9:33 PM

Share

చాలామంది వ్యాయామం తర్వాత వచ్చే నొప్పికి ‘లాక్టిక్ యాసిడ్’ కారణమని పొరబడుతుంటారు. కానీ అది పూర్తిగా అపోహ మాత్రమే. నిజానికి మీరు కష్టపడి వ్యాయామం చేసినప్పుడు మీ కండరాల కణజాలంలో సూక్ష్మమైన గాయాలు ఏర్పడతాయి. ఆ గాయాలు మళ్ళీ పూడుకునే ప్రక్రియలోనే కండరాలు మరింత బలంగా మారుతాయి. మరి ఈ నొప్పిని త్వరగా ఎలా తగ్గించుకోవాలి? మీ వర్కౌట్ దినచర్యలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తక్షణ ఉపశమనం కలిగించే సులభమైన మార్గాలను ఇప్పుడు చూద్దాం.

1. ‘మైక్రో టియర్స్’ అంటే ఏమిటి?

మీరు కఠినమైన వ్యాయామం చేసినప్పుడు, కండరాల ఫైబర్‌లలో చిన్న చిన్న న్నీళ్లు (Micro-tears) ఏర్పడతాయి. శరీరం వీటిని సరిచేయడానికి ఆ భాగానికి రక్త ప్రసరణను పెంచుతుంది. ఈ మరమ్మత్తు ప్రక్రియ వల్ల వాపు నొప్పి వస్తాయి. ఇది కండరాల పెరుగుదలకు అత్యంత అవసరమైన సహజ ప్రక్రియ.

2. లాక్టిక్ యాసిడ్ అపోహలు

వ్యాయామం చేసే సమయంలో లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది కానీ అది కొన్ని గంటల్లోనే శరీరం నుండి తొలగిపోతుంది. వ్యాయామం తర్వాత 24 నుండి 72 గంటల వరకు ఉండే నొప్పికి అసలు కారణం కండరాలలో ఏర్పడే సూక్ష్మ గాయాలే తప్ప లాక్టిక్ యాసిడ్ కాదు.

3. నొప్పి ఎప్పుడు ప్రమాదకరం?

సాధారణ నొప్పి 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. అయితే, నొప్పి భరించలేనంతగా ఉన్నా, విపరీతమైన వాపు కనిపించినా లేదా ఆ భాగాన్ని అస్సలు కదిలించలేకపోతున్నా.. అది ఏదైనా తీవ్రమైన అంతర్గత గాయానికి సంకేతం కావచ్చు. అప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

నొప్పి నుండి తక్షణ ఉపశమనం కోసం చిట్కాలు:

వార్మ్-అప్, కూల్-డౌన్: వ్యాయామం ప్రారంభించే ముందు కండరాలను సిద్ధం చేయడానికి వార్మ్-అప్, ముగించే ముందు రిలాక్స్ చేయడానికి కూల్-డౌన్ వ్యాయామాలు తప్పనిసరి.

లైట్ స్ట్రెచింగ్: వర్కౌట్ తర్వాత కండరాలను మెల్లగా సాగదీయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది.

నీరు ఆహారం: కండరాలు త్వరగా కోలుకోవడానికి పుష్కలంగా నీరు త్రాగాలి ప్రోటీన్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి.

విశ్రాంతి: కండరాలు నయం కావడానికి శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం.

క్రమంగా పెంచండి: వ్యాయామం తీవ్రతను లేదా బరువును అకస్మాత్తుగా కాకుండా క్రమక్రమంగా పెంచాలి.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఈ వ్యాసం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు నిపుణుల సలహాల ఆధారంగా రూపొందించబడింది. ఏదైనా తీవ్రమైన సమస్య ఉన్నప్పుడు సొంత చికిత్స కంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Follow Us
మన తాతల సీక్రెట్ ఈ పొలం పచ్చడే.. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్!
మన తాతల సీక్రెట్ ఈ పొలం పచ్చడే.. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్!
ఒక్కో పరుగుకు రూ. 14 వేలు.. దటీజ్ బుడ్డోడి బ్రాండ్ వాల్యూ
ఒక్కో పరుగుకు రూ. 14 వేలు.. దటీజ్ బుడ్డోడి బ్రాండ్ వాల్యూ
బాలీవుడ్ ఫిట్‌నెస్ క్వీన్ మలైకా డైట్ ప్లాన్, ఫిట్‌నెస్ సీక్రెట్
బాలీవుడ్ ఫిట్‌నెస్ క్వీన్ మలైకా డైట్ ప్లాన్, ఫిట్‌నెస్ సీక్రెట్
'NEET UG 2026 రీఎగ్జాం ఫలితాల తేదీ ఇదే.. MBBS తరగతులు ఆలస్యంకావు'
'NEET UG 2026 రీఎగ్జాం ఫలితాల తేదీ ఇదే.. MBBS తరగతులు ఆలస్యంకావు'
తెలంగాణలో రాబోయే 3 రోజులకు లేటెస్ట్ రిపోర్ట్ ఇదే
తెలంగాణలో రాబోయే 3 రోజులకు లేటెస్ట్ రిపోర్ట్ ఇదే
ఒక్క దెబ్బకు వీరి అప్పులు మొత్తం ఎగిరిపోతాయి.. మీ రాశి ఉందా?
ఒక్క దెబ్బకు వీరి అప్పులు మొత్తం ఎగిరిపోతాయి.. మీ రాశి ఉందా?
అమర పావురాల రహస్యం నుంచి మంచు శివలింగం వరకు.. బాబా బర్ఫానీ మహిమలు
అమర పావురాల రహస్యం నుంచి మంచు శివలింగం వరకు.. బాబా బర్ఫానీ మహిమలు
ప్రభుత్వ బ్యాంకుల్లో భారీగా కొలువులు.. డిగ్రీ అర్హతతో IBPS జాబ్స్
ప్రభుత్వ బ్యాంకుల్లో భారీగా కొలువులు.. డిగ్రీ అర్హతతో IBPS జాబ్స్
ఆకుకూరలు తినని వారికి బెస్ట్.. తోటకూర వేపుడు ఇలా చేస్తే వదలరు
ఆకుకూరలు తినని వారికి బెస్ట్.. తోటకూర వేపుడు ఇలా చేస్తే వదలరు
Cancer Awareness: MSD ప్రత్యేక కార్యక్రమంలో క్యాన్సర్‌పై అవగాహన
Cancer Awareness: MSD ప్రత్యేక కార్యక్రమంలో క్యాన్సర్‌పై అవగాహన