AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: ముఖం మీద మచ్చలు, బ్లాక్‌హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా పోగొట్టుకోండి..

వీటి కోసం మార్కెట్లో కూడా అనేక కెమికల్‌ ఆధారిత ఉత్పత్తులు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలోని కెమికల్స్ వల్ల మరిన్ని చర్మ సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. కానీ, బ్లాక్‌హెడ్స్ను పోగొట్టుకోవడానికి కొన్ని హోం రెమిడిస్‌ మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Beauty Tips: ముఖం మీద మచ్చలు, బ్లాక్‌హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా పోగొట్టుకోండి..
Black Heads
Jyothi Gadda
|

Updated on: Jul 02, 2024 | 12:06 PM

Share

ముక్కు, చెంపలు, గడ్డం మీద బ్లాక్ హెడ్స్ చాలా మందిని వేధించే సమస్య. ప్రధానంగా చర్మ రంధ్రాలలో మురికి చేరడం వల్ల బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. బ్లాక్‌హెడ్స్‌ను పోగొట్టుకోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వీటి కోసం మార్కెట్లో కూడా అనేక కెమికల్‌ ఆధారిత ఉత్పత్తులు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలోని కెమికల్స్ వల్ల మరిన్ని చర్మ సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. కానీ, బ్లాక్‌హెడ్స్ను పోగొట్టుకోవడానికి కొన్ని హోం రెమిడిస్‌ మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1. చక్కెర

చక్కెరతో స్క్రబ్ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. దీని కోసం, మీరు కట్ చేసిన నిమ్మకాయపై కొంచెం చక్కెరను చల్లుకుని ముఖంపై స్మూత్‌గా మర్ధనా చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే, త్వరలోనే మార్పు గమనిస్తారు.

ఇవి కూడా చదవండి

2. ఉప్పు బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి ఉప్పు కూడా మంచిది. ఉప్పు బ్లీచింగ్ ప్రభావం బ్లాక్ హెడ్స్ తొలగించడంలో సహాయపడుతుంది. మీరు ఉప్పుతో పాటు నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఎందుకంటే నిమ్మకాయలో కూడా బ్లీచింగ్ ప్రభావం ఉంటుంది. ఇందుకోసం నిమ్మరసంలో కాస్త ఉప్పు మిక్స్ చేసి బ్లాక్ హెడ్స్ పై అప్లై చేయాలి.

3. బొప్పాయి

బొప్పాయి, పాలపొడి, నిమ్మరసం, బియ్యప్పిండి కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించాలి. తర్వాత సున్నితంగా స్క్రబ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి.

4. అరటిపండు- ఓట్స్- తేనె

ఒక అరటిపండు గుజ్జు , రెండు చెంచాల గ్రౌండ్ ఓట్స్, ఒక చెంచా తేనె తీసుకోండి. తర్వాత వాటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

5. కొబ్బరి నూనె

ఒక టీస్పూన్ పసుపును ఒక టీస్పూన్ కొబ్బరి నూనెతో కలిపి పేస్ట్ లా చేయాలి. ఇప్పుడు దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

6. నిమ్మకాయ

ఒక చెంచా నిమ్మరసం, దాల్చిన చెక్క ముక్కపౌడర్‌, చిటికెడు తేనె వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్‌పై అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్