Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch:17 ఏళ్ల బ్యాడ్మింటన్ ప్లేయర్‌.. గ్రౌండ్‌లోనే కుప్పకూలి మృతి.. ఏం జరిగిందంటే..

జాంగ్ కిండర్ గార్టెన్‌లో ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. గత ఏడాది క్రితమే అతను చైనా జాతీయ యువ జట్టులో చేరాడు. అంతలోనే ఆయన ఆకస్మిక మృతితో అభిమానుల్లో తీరని విషాదం నెలకొంది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా జాంగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిభావంతుడైన క్రీడాకారుడిని కోల్పోయాం అని పీవీ సింధు ట్విట్‌ చేశారు.

Watch:17 ఏళ్ల బ్యాడ్మింటన్ ప్లేయర్‌.. గ్రౌండ్‌లోనే కుప్పకూలి మృతి.. ఏం జరిగిందంటే..
Badminton Player Death
Jyothi Gadda
|

Updated on: Jul 02, 2024 | 10:43 AM

Share

ఆకస్మిక మరణాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అన్ని వయసుల వారిలోనూ ఈ ఇలాంటి అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ఒకరు ఆడుతూనే లోకాన్ని విడిచి వెళ్లిపోతుంటే, మరొ కూర్చొన్న చోటే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి అనేక కేసులకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు చైనాలో ఒక కుర్రాడి మృతికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వైరల్‌ వీడియోలో బ్యాడ్మింటన్ ఆడుతున్న బాలుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఆ మరుక్షణంలోనే మరణించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా ప్రజల్ని కలవరపెడుతోంది.

ఇండోనేషియాలోని యోగ్యకార్తాలో జరుగుతున్న అంతర్జాతీయ టోర్నీ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాడ్మింటన్ ఆడుతూ ఓ ఆటగాడు కోర్టులో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడున్న ఎవరికీ ఏం జరిగిందో అర్థం కాలేదు. అందరూ తేరుకునే లోపుగానే అతడు చనిపోయాడు. ఉన్నట్టుండి ఆటగాడు గుండెపోటుకు గురై కిందపడిపోవడంతో ఆటగాళ్లు, రిఫరీ, ప్రేక్షకులు షాక్‌లో ఉండిపోయారు. విషయమేమిటో ఎవరికీ అర్థం కాలేదు. మరో రెండు నిమిషాల్లో ఆస్పత్రికి తరలించినా.. ప్రాణాలను కాపాడలేకపోయారు.

ఇవి కూడా చదవండి

చైనాకు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు జాంగ్ జిజీ ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో జపాన్‌కు చెందిన కజుమా కవానోతో ఆడుతున్నాడు. అకస్మాత్తుగా అతను కుప్పకూలిపోయాడు, కొంత సమయం తర్వాత అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను మరణించాడు. బ్యాడ్మింటన్ ఆసియా, ఇండోనేషియా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (PBSI) ప్రతిభావంతులైన ఆటగాడిని కోల్పోయామని ఒక ప్రకటన విడుదల చేసింది.

జాంగ్ కిండర్ గార్టెన్‌లో ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. గత ఏడాది క్రితమే అతను చైనా జాతీయ యువ జట్టులో చేరాడు. అంతలోనే ఆయన ఆకస్మిక మృతితో అభిమానుల్లో తీరని విషాదం నెలకొంది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా జాంగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిభావంతుడైన క్రీడాకారుడిని కోల్పోయాం అని పీవీ సింధు ట్విట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..