గారెలు, వడలు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉండాలంటే…ఈ టిప్స్‌ ట్రైచేసి చూడండి

గారెలు, వడలు, నూనెలో ఫ్రై చేసిన ఏ పదార్థాలనైనా అలానే తినకూడదు. వాటిని కాల్చుకున్న తర్వాత టిష్యూ, బటర్‌ పేపర్, కిచెన్ టవల్‌లో వేయాలి. అప్పుడే అందులోని నూనె తగ్గుతుంది. దీంతో ఎక్సెస్ ఆయిల్ ఆ పేపర్స్ పీల్చుకుంటాయి.ఈ చిట్కాలు ఫాలో అయితే ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా తినవచ్చు.

గారెలు, వడలు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉండాలంటే...ఈ టిప్స్‌ ట్రైచేసి చూడండి
Vada Without Absorbing Oil
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 02, 2024 | 10:20 AM

పండుగలు, ప్రత్యేక రోజు ఏదైన ఉందంటే.. చాలా మంది పిండివంటల్ని చేసుకుని తింటారు. కొన్నిసార్లు మామూలుగా కూడా ఇంట్లో పూరీ, వడ వంటివి చేస్తుంటారు. పిల్లలు ఇష్టంగా తింటారని ఇళ్లలో వడలు,పూరీ, గారెలు తరచూగా బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్‌గా కూడా చేస్తుంటారు. అయితే, పూరీ, వడ, గారెలు వంటివి చేసేటప్పుడు వాటిని ఎక్కువ ఆయిల్‌లో కాల్చాల్సి వస్తుంది. అప్పుడు ఆ వంటకం నూనె ఎక్కువగా పీల్చకుండా ఉండేదుకు కొన్ని ఉపాయాలు ఉన్నాయి. వాటితో ఎక్కువ నూనెతో ఇబ్బంది లేకుండా మీ వంటకాలు ఆయిల్‌ను లైట్‌గా పీల్చుకునే చేసుకోవచ్చు. అలాంటి టిప్స్‌ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

మీరు ఇంట్లో వడలు చేయాలనుకున్నప్పుడు సహజంగానే వడలు మొత్తగా ఉండాలని పిండిని మెత్తగా రుబ్బుకుంటారు. కానీ, దీని వల్ల నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి. గట్టిగా రుబ్బితే గారెలు గట్టిగా వస్తాయి. అలా కాకుండా పిండిని నార్మల్‌గా మీడియం రేంజ్‌లో రుబ్బుకోవాలి. అలాగే, ఇక వడలు చేసేప్పుడు నూనె బాగా వేడేక్కిన తర్వాతే వడలు, గారెలు వేసి కాల్చుకోవాలి. తక్కువ వేడిగా ఉన్నప్పుడు వేస్తే అవి నూనెని ఎక్కువగా పీల్చుకుంటాయి. అంతేకాకుండా మంటను ఎప్పుడు తక్కువ ఫ్లేమ్‌లో పెట్టుకోవటం కూడా చెయొద్దు. ఎక్కువ మంటపెట్టి వడల్ని వేయించుకోవాలి. అయితే, నూనెని మరీ ఎక్కువగా వేడి చేయొద్దు. మీడియం కంటే వేడిగా ఉండాలి. మరీ ఎక్కువ వేడి అయితే గారెలు పై పైన మాడిపోతాయి. లోపల పచ్చిగానే ఉంటాయి.

అలాగే, గారెలు కరకరలాడుతూ ఉండాలంటే గారెల పిండిలో కొంచెం సేమ్యా కలపాలి. దాంతో పాటు గారెల పిండి మిక్సీ చేసిన 5 నిమిషాల లోపే గారెలను వేసుకుంటే నూనె పీల్చవు. గారెలు, వడలు, నూనెలో ఫ్రై చేసిన ఏ పదార్థాలనైనా అలానే తినకూడదు. వాటిని కాల్చుకున్న తర్వాత టిష్యూ, బటర్‌ పేపర్, కిచెన్ టవల్‌లో వేయాలి. అప్పుడే అందులోని నూనె తగ్గుతుంది. దీంతో ఎక్సెస్ ఆయిల్ ఆ పేపర్స్ పీల్చుకుంటాయి.ఈ చిట్కాలు ఫాలో అయితే ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా తినవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే