Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పాము, తాబేలు యుద్ధం.. గెలిచింది ఎవరో తెలుసా..? వైరలవుతున్న వీడియో

నాగుపాము తాబేలు నడుమ ఫైటింగ్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా..? తాబేలును కాటువేసేందుకు ప్రయత్నించిన నాగుపాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకసారి నాగుపాము ఎవరినైనా కాటేస్తే, అతను ప్రాణాలతో తప్పించుకోవడం కష్టంగా మారుతుంది. అలాంటిది ఒక బుల్లి తాబేలు నిర్భయంగా నాగుపాము దగ్గరికి వెళ్లి సవాల్‌ చేస్తోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Watch Video: పాము, తాబేలు యుద్ధం.. గెలిచింది ఎవరో తెలుసా..? వైరలవుతున్న వీడియో
Turtle Vs Snake
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 02, 2024 | 9:23 AM

పాములంటే ప్రతి ఒక్కరికీ భయమే. చివరకు నాగుపాము వల్ల సింహం, పులి వంటి జంతువులు కూడా వణికిపోతాయి.! ప్రమాదకరమైన పాముల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పాములతో పక్షులు ఫైట్‌ చేయటం చూస్తుంటాం. అలాగే, పాముతో ముంగిస చేసే యుద్ధం చాలా వీడియోల్లో చూశాం. అలాగే కొన్ని సందర్భాల్లో పాములతో కోడి, కుక్క, కోతి కూడా గొడవడ్డ వీడియోలు చూశాం. అయితే, అలాంటిదే నాగుపాము తాబేలు నడుమ ఫైటింగ్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా..? తాబేలును కాటువేసేందుకు ప్రయత్నించిన నాగుపాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకసారి నాగుపాము ఎవరినైనా కాటేస్తే, అతను ప్రాణాలతో తప్పించుకోవడం కష్టంగా మారుతుంది. అలాంటిది ఒక బుల్లి తాబేలు నిర్భయంగా నాగుపాము దగ్గరికి వెళ్లి సవాల్‌ చేస్తోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

వీడియోలో నాగుపాము పడగవిప్పి చుట్టుకొని కూర్చున్నట్లుగా కనిపిస్తుంది. దాని ఎదురుగా ఒక చిన్న తాబేలు ఆ పాము వైపు నడుస్తుంది. దాంతో తనపై దాడి చేస్తుందనే భయంతో నాగుపాము తాబేలును కాటువేయడానికి పూర్తి ట్రై చేస్తుంది. అయితే తాబేలును కాటువేయడం అంత సులభం కాదని నాగుపాముకు బహుశా తెలియకపోవచ్చు. నాగుపాము రెండోసారి తాబేలును కాటు వేయడానికి ప్రయత్నించింది. అప్పుడు పాపం ఆ నాగుపాము పరిస్థితి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by India YaTra (@india.yatra)

ఈ వీడియో Instagram హ్యాండిల్ @india.yatraలో షేర్ చేయబడింది. ఈ వీడియో చాలా వైరల్‌గా మారుతోంది. ఇప్పటివరకు దీనికి 29 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అలాగే ఈ వీడియోకి ఇప్పటి వరకు 4 లక్షల 20 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానించారు కూడా. చాలా మంది వినియోగదారులు ఈ పోస్ట్‌పై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. పాపం.. ఆ పాము పళ్ళు విరిగిపోయి ఉండాలి అంటూ కొందరు కామెంట్‌ చేయగా, ఇంతకు ముందెన్నడూ ఇలాంటి పామును తాబేలు చూడలేదనిపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఇలా చాలా మంది చాలా రకాలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..