పనస పండు శరీరంలోని గ్లూకోస్, ఇన్సులిన్, గ్లెసెమిక్ స్థాయులను నియంత్రిస్తుంది. ఫలితంగా రక్తంలోని చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటుంది. పచ్చి జాక్‌ఫ్రూట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.జాక్‌ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు A-C, రిబోఫ్లావిన్, మెగ్నీషియం, పొటాషియం, రాగి మరియు మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి.