Raw Spices: వంట ఇంటి పోపుల పెట్టెలో ఉండే ఔషధాలు చెట్టు మీద పండ్లు, కాయల రూపంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాయో తెలుసా..

భారతీయుల వంట ఇల్లే ఓ ఔషధ శాల. పోపుల పెట్టె మెడిసిన్ షాప్ అని అంటారు. రోజువారీ తినే ఆహారంలో రకరకాల ఆహర పదార్ధాలను వినియోగిస్తారు. ముఖ్యంగా నల్ల మిరియాల నుంచి లవంగాల వరకు.. భారతీయ వంటల్లో ఉపయోగించే ప్రతి మసాలా దినుసు దాని ప్రత్యేకమైన సువాసన, అద్భుతమైన రుచితో పాటు ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. ఇంట్లో ఎండుమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క వంటి రకరకాల చాలా మసాలా దినుసులు చూసి ఉంటారు. అయితే వాటి చెట్ల గురించి ఆ మసాలా దినుసు అవి పచ్చిగా ఉన్నప్పుడు అంటే వాటిని పండ్ల రూపంలో ఉన్నప్పుడు, చెట్లపై పుసినప్పుడు ఎలా కనిపిస్తాయో అతి తక్కువ మందికి తెలుసు.. కనుక మసాలా దినుసుల్లో కొన్ని చెట్ల గురించి వాటి మొదటి రూపాన్ని ఈ రోజు చూద్దాం

Surya Kala

|

Updated on: Jul 01, 2024 | 12:29 PM

మసాలా దినుసులలో రారాజుగా పిలవబడే నల్ల మిరియాలు. దీని ఘాటైన  రుచితో పాటు అనేక పోషక లక్షణాలను కలిగి ఉంది. ఈ మిరియాలు చెట్టుపై కాయలుగా కాకుండా గుత్తులుగా పెరుగుతాయి. కోసిన తర్వాత ఆక్సీకరణం చెంది సుగంధ ద్రవ్యం మిరియలుగా తయారుచేస్తారు. (photo-pixabay)

1 / 6
జాజికాయ దీనిని మసాలా వంటకాల నుంచి తీపి డెజర్ట్‌ల వరకు ప్రతిదానికీ రుచిని జోడించడానికి ఉపయోగిస్తారు. నిజానికి ఇది నేరేడు పండులా కనిపించే పండుకి సంబంధించిన విత్తనం. పండ్లను పగలగొట్టి దానిలోని విత్తనాలను వేరు చేసి ఎండబెట్టడం ద్వారా జాజికాయలను తయారు చేస్తారు. (photo- pixabay)

2 / 6
వంటల్లో సుగంధ ద్రవ్యాలుగా ఉపయోగించే మసాలా దినుసుల్లో లవంగాలు వెరీ వెరీ స్పెషల్. ఇది రుచి, సువాసనలతో పాటు అద్భుతమైన ఔషధ గుణాలను కూడా కలిగి ఉన్నాయి. మిర్టేసి కుటుంబానికి చెందిన వృక్షమైన సిడిజియం అరోమాటికమ్‌ కొమ్మలపై పెరిగే విచ్చీవిచ్చని పూమొగ్గలే లవంగాలు. తాజాగా ఉన్నప్పుడు కాస్త గులాబీరంగులో ఉండే మొగ్గల్ని కోసి ఎండబెడతారు. దాంతో అవి క్రమంగా ముదురు గోధుమరంగులోకి మారతాయి.(photo- pixabay)

3 / 6
జాపత్రి ఎరుపు లేదా లేత నారింజ రంగులో ఉండే సుగంధ ద్రవ్యం. ఈ జాపత్రి, జాజికాయ ఒకే చెట్టు నుండి లభిస్తాయి. మిస్టికా చెట్టు పండులోని విత్తనం (జాజికాయ) తీసే సమయంలో విత్తనం చుట్టూ ఎరుపు రంగు నారలను తీస్తారు. ఈ పీచుని ఎండబెట్టిన తర్వాత జాపత్రిగా మారుతాయి. (photo-pixabay-freepik)

4 / 6
ఆవాలు, ఆవ నూనెను భారతీయ వంటల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే ఆవాలు ఊరగాయల నుంచి మసాలా కూరల్లో ఉపయోగిస్తారు. ఆవాల సాగును చాలా మంది తప్పక చూసి ఉంటారు. పసుపు పువ్వులతో ఆవ మొక్కలు చాలా అందంగా కనిపిస్తాయి. ఈ మొక్కలు చక్కటి కాయలను ఉత్పత్తి చేస్తాయి. వీటి నుంచి ఆవాలు గింజలు తీస్తారు.

5 / 6
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా పరిగణించబడే కుంకుమపువ్వును చల్లని ప్రదేశాలలో పండిస్తారు. ఇది ఒక రకమైన మొక్క. కుంకుమపువ్వు మొక్కలు చాలా చిన్నవి. ఈ మొక్కలకు లావెండర్ రంగు పువ్వులు ఉంటాయి. ఈ పువ్వుల మధ్య సన్నని గడ్డి లాంటి ఆకులు (కేసరాలు) ఉంటాయి. వీటిని చాలా జాగ్రత్తగా పండించి ఎండబెట్టి మసాలాగా ఉపయోగిస్తారు. (photo-pixabay)

6 / 6
Follow us