AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol: ఇక్కడ లీటర్ పెట్రోల్ కేవలం రూ. 2 మాత్రమే.. ఆశ్చర్యపడేలోపే షాక్ అవుతారు.!

భారత్‌లో పెట్రోల్ ధరలు రూ.100కు పైగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సాధారణ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో లీటర్ పెట్రోల్ కేవలం రూ.2 నుంచి రూ.3కే లభిస్తోంది. లిబియా, ఇరాన్, వెనిజులా లాంటి దేశాల్లో చమురు ఉత్పత్తి, సబ్సిడీల కారణంగా ధరలు తక్కువగా ఉన్నాయని మీకు తెలుసా..!

Petrol: ఇక్కడ లీటర్ పెట్రోల్ కేవలం రూ. 2 మాత్రమే.. ఆశ్చర్యపడేలోపే షాక్ అవుతారు.!
Petrol Pump
Ravi Kiran
|

Updated on: Feb 28, 2026 | 2:51 PM

Share

భారతదేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100కు పైగా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేయాలంటే రూ.100 కన్నా తక్కువకు ఎక్కడా లభించడం లేదు. గత కొన్నేళ్లలో ఈ ధరలు విపరీతంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతున్నప్పటికీ, భారత్‌లో పెట్రోల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే చాలామంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ఏటా పెరుగుతున్నాయి.

భారత్‌లో పెట్రోల్ ధరలు చాలా ఎక్కువగా ఉండగా, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో లీటర్ పెట్రోల్ కేవలం రూ.2 నుంచి రూ.3కే లభిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకే పెట్రోల్ లభించే దేశాలలో లిబియా ముందుంది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర 0.024 డాలర్లుగా ఉంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.2.15కు సమానం. ధరల్లో మార్పులను బట్టి ఇది సుమారు రూ.3 వరకు చేరుకోవచ్చు. లిబియా తర్వాత ఇరాన్‌లో కూడా అత్యంత చౌక ధరకే పెట్రోల్ దొరుకుతుంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర 0.029 డాలర్లు, అంటే ఇండియన్ కరెన్సీలో కేవలం రూ.2.50కి లభిస్తుంది. ఇక లిబియా, ఇరాన్ తర్వాత వెనిజులా మూడో స్థానంలో ఉంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ 0.035 డాలర్లు, ఇది భారతీయ కరెన్సీలో సుమారు రూ.3గా ఉంటుంది. పెట్రోల్ ధర తక్కువగా ఉన్న దేశాల్లో అంగోలా నాలుగో స్థానంలో ఉంది, ఇక్కడ లీటర్ పెట్రోల్ కేవలం రూ.27కు లభిస్తుంది. తర్వాతి స్థానంలో కువైట్ ఉంది, అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.28గా కొనసాగుతోంది.

పెట్రోల్ ధరల విషయంలో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో 73వ స్థానంలో ఉంది. భారత్ ముడిచమురును విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల ఎగుమతి, దిగుమతి సుంకాలు, రాష్ట్రాల ట్యాక్సులు, రవాణా ఛార్జీల కారణంగా పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉంటాయి. చమురు ఉత్పత్తి ఎక్కువగా ఉండే దేశాల్లో ధరలు సహజంగానే తక్కువగా ఉంటాయి. చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే దేశాల్లో ధరలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.

Follow Us
రాబోయే 3 నెలల్లో వీరి జీవితం టర్న్.. అపార ధనలాభం, భోగభాగ్యాలు!
రాబోయే 3 నెలల్లో వీరి జీవితం టర్న్.. అపార ధనలాభం, భోగభాగ్యాలు!
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!
పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
ఏపీలో ఇకపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు.. ప్రభుత్వ నిర్ణయం..
ఏపీలో ఇకపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు.. ప్రభుత్వ నిర్ణయం..
ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం వీడలేదు.. భార్యపై అనుమానంతో..
ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం వీడలేదు.. భార్యపై అనుమానంతో..
ఈ అవయవాలు దెబ్బతింటే బాగుచేయడం దేవుడి వల్ల కూడా కాదట!
ఈ అవయవాలు దెబ్బతింటే బాగుచేయడం దేవుడి వల్ల కూడా కాదట!
సంపూర్ణేష్‌కు అంత తక్కువా..!!
సంపూర్ణేష్‌కు అంత తక్కువా..!!
గురువారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి వీరివైపు కన్నెత్తి కూడా చూడదు
గురువారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి వీరివైపు కన్నెత్తి కూడా చూడదు
వినాయకుడికి 11 వ రోజు సేమియా కేసరి నైవేద్యంగా పెట్టండి..
వినాయకుడికి 11 వ రోజు సేమియా కేసరి నైవేద్యంగా పెట్టండి..