Travel Benefits: రొటీన్ లైఫ్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేయండి మనస్సు, శరీరం ఫిట్‌గా ఉంటుంది

చాలా మంది చాలా బిజీగా ఉన్నా సరే ఒకట్రెండు రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తుంటారు. ఇలా చేయడం వలన గాలి మార్పు మాత్రమే కాదు శరీరానికి, మనస్సుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలామంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. ప్రయాణానికి అనవసరమైన ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే వాకింగ్‌కు వెళ్లడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు అనేక శారీరక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Travel Benefits: రొటీన్ లైఫ్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేయండి మనస్సు, శరీరం ఫిట్‌గా ఉంటుంది
Monsoon Travel Tips
Follow us
Surya Kala

|

Updated on: Jul 02, 2024 | 11:39 AM

ఒకప్పుడు వైద్యులు అనారోగ్యం బారిన పడిన వ్యక్తులకు లేదా శస్త్రచికిత్స జరిగిన తర్వాత గాలి మార్పు కోసం ఎక్కడికైనా వెళ్ళమని రోగులకు సలహా ఇచ్చేవారు. అయితే కాలం మారింది.. దీంతో తాము వైద్యుడిని సంప్రదించే ముందు ప్రయాణం చేయాలని ఎక్కువ మంది ప్లాన్ చేస్తున్నారు. చాలా మందికి రొటీన్ లైఫ్ నుంచి బయటపడడానికి మాత్రమే కాదు అనారోగ్యం నుంచి కూడా విముక్తి పొందేందుకు ప్రయాణం చేసే అలవాటు ఉంటుంది. చాలా మంది చాలా బిజీగా ఉన్నా సరే ఒకట్రెండు రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తుంటారు. ఇలా చేయడం వలన గాలి మార్పు మాత్రమే కాదు శరీరానికి, మనస్సుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలామంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. ప్రయాణానికి అనవసరమైన ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే వాకింగ్‌కు వెళ్లడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు అనేక శారీరక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

  1. ఒత్తిడిని తగ్గిస్తుంది: మీరు రోజువారీ జీవితం నుంచి కొంత శాంతి లేదా ఉపశమనం పొందాలనుకుంటే ఖచ్చితంగా ఒక్కరోజైనా సరదాగా గడపడం కోసం బయటకు వెళ్లండి. ఇలా చేయడం వలన ట్రావెలింగ్ వల్ల కొత్త ప్రదేశాలను సందర్శించడంతోపాటు ప్రకృతికి మరింత దగ్గరవుతారు. ఇలా చేయడం వలన ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. కనుక మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేకపోయినా, ఒంటరిగా బయటకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదించండి. అప్పుడు ఒత్తిడి తగ్గడంతో పాటు ఆలోచనా శక్తి, సృజనాత్మకత పెరుగుతుంది.
  2. కుటుంబం , స్నేహితులతో సమయం గడపడానికి అవకాశం: ఆఫీసు ఒత్తిడి కారణంగా చాలా మంది కుటుంబ సభ్యులతో గడపడానికి తగిన సమయం ఇవ్వలేరు. దీంతో కుటుంబ సభ్యులకు తెలియకుండానే దూరం ఏర్పడుతుంది. కుటుంబం లేదా స్నేహితులతో కనీసం కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళడం వలన ఆ దూరం తొలగిపోతుంది.
  3. కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని పొందండి: కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయడం ద్వారా అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ప్రత్యేకించి కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు భౌగోళిక ప్రదేశంలోని జనం నుంచి వాటి జీవనశైలి, వ్యక్తుల గురించి చాలా నేర్చుకోవచ్చు. బస్సులు, రైళ్లు, విమాన మార్గాల గురించి కూడా అనుభవం లభిస్తుంది. ఇలా చేయడం వలన ఒత్తిడి నుంచి విముక్తి లభించి భవిష్యత్తు జీవితానికి ఉపయోగపడుతుంది. ప్రతి ప్రయాణం జీవితంలో కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. ఇలాంటి ప్రయాణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి.
  4. ఫిట్‌గా ఉండండి: ప్రయాణం అంటే ఒక చివర నుండి మరొక చివరకి పరుగెత్తడం. పర్వతాలకు వెళితే స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు. అందమైన ప్రదేశాలను చూస్తూ సంతోషంగా గడపవచ్చు. ఇది మిమ్మల్ని మరింత చురుకుగా, ఫిట్‌గా చేస్తుంది. అంతేకాదు మానసికంగా శాంతిని పొందుతారు.
  5. ఇవి కూడా చదవండి
  6. కొత్త సంస్కృతిని తెలుసుకోవడం: ఒక కొత్త ప్రదేశాన్ని సందర్శించినప్పుడు అక్కడి సంస్కృతి, నాగరికతను చాలా దగ్గరగా తెలుసుకోవచ్చు. అంతే కాకుండా అక్కడి ఆహారం, ప్రజల భాషను అవగాహన చేసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏమైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)