AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakbhushundi: రామాయణంలో కాకభూషుండి ఎవరు? కాకిలా ఎవరి శాపం వలన మారాడో తెలుసా..

పురాణాల ప్రకారం శ్రీరాముని కథను పరమశివుడు పార్వతిదేవికి వివరించాడు. అప్పుడు కాకి కూడా ఆ కథ విన్నది. అదే కాకి మళ్లీ జన్మలో కాకభూషుండిగా పుట్టాడు. కాకభూషుండి తన గత జన్మలో శివుని నోటి నుండి విన్న రాముని కథను పూర్తిగా గుర్తుంచుకున్నాడు. అందుకే అతను ఈ కథను ఇతర వ్యక్తులకు కూడా వివరించాడు. శివుడు చెప్పిన కథను అధ్యాత్మ రామాయణం అంటారు.

Kakbhushundi: రామాయణంలో కాకభూషుండి ఎవరు? కాకిలా ఎవరి శాపం వలన మారాడో తెలుసా..
Kakbhushundi In Ramayan
Surya Kala
|

Updated on: Jul 02, 2024 | 9:15 AM

Share

కాకభూషుండి ఒక విలక్షణమైన పాత్ర. కాకభూషుండి గురించి రామ చరితమానసలోని ఉత్తరకాండలో కక్భూషుండి అత్యంత జ్ఞానవంతుడైన రాముని భక్తుడు అని పేర్కొంది. అయితే ఒక మహర్షి శాపం కారణంగా తన జీవితమంతా కాకిలా గడపాల్సి వచ్చింది. అయితే అసలు కాకభూషుండి ఎవరు? రామ భక్తుడు ఎందుకు కాకిగా మారాడు తెలుసుకుందాం..

కాకభూషుండి ఎవరు?

పురాణాల ప్రకారం శ్రీరాముని కథను పరమశివుడు పార్వతిదేవికి వివరించాడు. అప్పుడు కాకి కూడా ఆ కథ విన్నది. అదే కాకి మళ్లీ జన్మలో కాకభూషుండిగా పుట్టాడు. కాకభూషుండి తన గత జన్మలో శివుని నోటి నుండి విన్న రాముని కథను పూర్తిగా గుర్తుంచుకున్నాడు. అందుకే అతను ఈ కథను ఇతర వ్యక్తులకు కూడా వివరించాడు. శివుడు చెప్పిన కథను అధ్యాత్మ రామాయణం అంటారు.

ఇవి కూడా చదవండి

కథ విన్న పాముకు విముక్తి

పురాణ గ్రంధాలలో కాకభూషుండి అత్యున్నత జ్ఞానవంతుడు, రామభక్తుడుగా వర్ణించబడింది. రామ చరిత మానస చరిత్ర ప్రకారం శ్రీరాముడు, రావణుడి మధ్య జరిగిన యుద్ధంలో రావణుడి కుమారుడు మేఘనాదుడు శ్రీరాముడిని, లక్ష్మణుడిని పాముతో కట్టివేసినప్పుడు.. నారద ముని ఆదేశానుసారం, గరుత్మంతుడు శ్రీరాముని, లక్ష్మణుడులను పాము బంధం నుంచి విడిపించాడు.

సందేహాన్ని తొలగించిన కాకభూషుండి

శ్రీరాముడు పాముతో బంధించబడడం చూసిన గరుత్మంతుడికి రామావతారంపై అనుమానం కలిగింది. అప్పుడు గరుత్మంతుడు సందేహాలను తీర్చడానికి నారదుడు గరుత్మంతుడిని బ్రహ్మ దేవుడి వద్దకు పంపాడు. బ్రహ్మదేవుడు అతన్ని మహాదేవుని వద్దకు పంపాడు. గరుత్మంతుడు సందేహాలను తీర్చడానికి మహాదేవుడు అతడిని కాకభూషుండి వద్దకు పంపాడు. చివరగా కాకభూషుండి శ్రీరాముని పాత్రను గరుత్మంతుడికి వివరించి అతని సందేహాన్ని తొలగించాడు.

కాకభూషుండి ఎలా కాకి అయ్యాడంటే

గరుత్మంతుడి సందేహాన్ని నివృత్తి చేసిన తర్వాత.. కాకభూషుండి తాను కాకిగా మారిన కథను అతనికి చెప్పాడు. దీని ప్రకారం కాకభూషుండి మొదట అయోధ్య పురిలో ఒక శూద్రుని ఇంట్లో జన్మించాడు. అతను శివ భక్తుడు. అయితే అహంకార ప్రభావంతో శివ స్తుతిని పర దేవతలను నిందించడం మొదలు పెట్టాడు. ఒకసారి అయోధ్యలో కరువు వచ్చినప్పుడు అతను ఉజ్జయినికి వెళ్ళాడు. అతను ఒక బ్రాహ్మణుడికి సేవ చేస్తూ నివసించడం ప్రారంభించాడు. ఆ బ్రాహ్మణుడు కూడా శివభక్తుడే.. అయితే ఇతర దేవతలను నిందించలేదు. ఒకసారి కాకభూషుండి చర్యలకు బాధపడుతూ, గురువు శ్రీ రామునిపై భక్తిని కాకభూషుండికి ప్రబోధించడం ప్రారంభించాడు.

శపించిన శివుడు

అహంకార మత్తులో ఉన్న కాకభూషుండి ఒకసారి తన గురువును అవమానించగా.. అప్పుడు శివుడికి కోపం వచ్చింది. దీంతో తన గురువును అవమానించిన కాకభూషుండిని శపించాడు. పాము రూపంలో పుట్టిన తర్వాత 1000 సార్లు అనేక జాతుల్లో జన్మించాలని శాపం ఇచ్చాడు. అయితే బ్రాహ్మణుడు.. కాకభూషుండిని క్షమించమని శివుడిని అభ్యర్థించాడు. అయితే శివుడు కాకభూషుండి చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పాడు.

లోమాష్ ఋషి శాపం

కాలక్రమేణా అతను శ్రీరాముని పట్ల భక్తిని పెంచుకున్నాడు. చివరకు బ్రాహ్మణ శరీరాన్ని పొందాడు. అతను జ్ఞానాన్ని పొందడానికి లోమాష్ ఋషి వద్దకు వెళ్ళాడు. లోమాష్ ఋషి అతనికి జ్ఞానాన్ని పెంచే విధంగా సూచనలు,సలహాలు ఇచ్చే సమయంలో లోమాష్ ఋషి తో కాకభూషుండి చాలా రకాల వాదనలు చేసేవాడు. అతని ప్రవర్తనకు ఆగ్రహించిన ఋషి లోమాష్ అతనిని చండాల పక్షిగా అంటే కాకిగా మారమని శపించాడు. వెంటనే కాకిలా మారి కాకభూషుండి ఎగిరిపోయాడు. శాపవిమోచనం తరువాత లోమాష్ ఋషి పశ్చాత్తాపపడి కాకిని వెనక్కి పిలిచి.. రామమంత్రాన్ని చెప్పి.. అనాయాస ముక్తిని పొందే వరాన్ని కూడా ఇచ్చాడు. రామమంత్రాన్ని స్వీకరించిన కాకి తర్వాత కాకభూషుండి అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు