Panjurli Deity: అడవులను, పంటలను కాపాడే దేవత పంజుర్లి.. ఎవరి అవతారం అంటే

పంజుర్లీ అడవిని, అక్కడ నివసించే ప్రజలను రక్షిస్తుందని విశ్వాసం. ప్రజలు తమ కుటుంబంతో పాటు తమ భూమి, వ్యవసాయం పంటను రక్షించమని పంజుర్లి దేవతను పూజిస్తారు. పంజుర్లీ అంటే ఏమిటంటే ఉగ్ర (హింసాత్మక).. పంజి(పంది).. చెడు పనులు చేసే వారిని శిక్షించి, మంచిని ఆశీర్వదించే సామర్ధ్యాలు కలిగిన దేవత అని నమ్మకం.

Panjurli Deity: అడవులను, పంటలను కాపాడే దేవత పంజుర్లి.. ఎవరి అవతారం అంటే
Panjurli Deity
Follow us
Surya Kala

|

Updated on: Jul 02, 2024 | 7:26 AM

పంజుర్లీ దేవత గురించి కాంతారా సినిమా తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇంకా చెప్పాలంటే దేశ వ్యాప్తంగా పంజుర్లీ దేవత ఎవరు అనే ఆసక్తి నెలకొంది. అయితే పంజుర్లీ దక్షిణ భారతదేశంలో పూజించబడే పంది ముఖం గల దేవత. కర్నాటక, కేరళలో ప్రత్యేకంగా పంజుర్లీని పూజిస్తారు. పంజుర్లీ అడవిని, అక్కడ నివసించే ప్రజలను రక్షిస్తుందని విశ్వాసం. ప్రజలు తమ కుటుంబంతో పాటు తమ భూమి, వ్యవసాయం పంటను రక్షించమని పంజుర్లి దేవతను పూజిస్తారు. పంజుర్లీ అంటే ఏమిటంటే ఉగ్ర (హింసాత్మక).. పంజి(పంది).. చెడు పనులు చేసే వారిని శిక్షించి, మంచిని ఆశీర్వదించే సామర్ధ్యాలు కలిగిన దేవత అని నమ్మకం.

పంజుర్లీ దేవత ఎవరి అవతారం? విష్ణువు దశావతారాల్లో మూడవ అవతారం వరాహగా పరిగణించబడుతుంది. ఈ అవతార రూపం పందిలా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఆయనను పంజుర్లీ దేవతగా పూజిస్తారు. సత్యయుగ అవతారమైన వరాహ గురించి కొన్ని పౌరాణిక నమ్మకాలు ఉన్నాయి. విష్ణు పురాణం, స్కాంద పురాణం, ఋగ్వేదం, భగవద్ పురాణాలలో వరాహ అవతారానికి సంబంధించిన సమాచారం ఉంది. దక్షిణాదిన అత్యంత ప్రాచీనమైన దేవతలలో పంజుర్లి ఒకటి. మానవ నాగరికత ప్రారంభంలో.. అదే సమయంలో భూమిపై ఆహార ధాన్యాలు కనిపించినప్పుడు, పంజురళి దేవత భూమిపైకి వచ్చిందని నమ్ముతారు.

పంజుర్లీ దేవత కథ

ఇవి కూడా చదవండి

పురాణాల ప్రకారం వరాహ మూర్తికి ఐదుగురు కుమారులు ఉన్నారు.. వారిలో ఒకరు నవజాత శిశువుగా మిగిలిపోయారు. అతను ఆకలి, దాహంతో బాధపడుతూ చివరికి మృత్యువు అంచుకు చేరుకున్నాడు. అదే సమయంలో అటుగా ప్రయాణిస్తున్న పార్వతి దేవి అక్కడికి చేరుకుంది. అప్పుడే పుట్టిన పందిని చూసి జాలిపడి దాన్ని కైలాస పర్వతానికి తీసుకెళ్లింది. తల్లి పార్వతి అతనిని తన సొంత కొడుకులా చూసుకోవడం ప్రారంభించింది. కొన్ని సంవత్సరాల తరువాత ఆ పిల్లవాడు విధ్వంసకరంగా మారాడు. కాలక్రమేణా అతని శరీరానికి దురద వెయ్యడం మొదలైంది. దీంతో తన దురదనుంచి ఉపశమనం కోసం భూమిపై ఉన్న అన్ని పంటలను నాశనం చేయడం ప్రారంభించాడు.

శివునికి కోపం వచ్చింది దీని వల్ల భూలోకంలో ఆహార కొరత ఏర్పడింది. అది చూసిన శంకరుడు ఆ పందిని చంపాలని భావించాడు, ఈ విషయం పార్వతి దేవికి తెలియడంతో ఆమె మహాదేవుడిని ప్రార్ధించి తన కొడుకు ప్రాణం తీయవద్దని కోరింది. పార్వతీదేవి కోరికపై శివుడు అతన్ని చంపలేదు. అయితే అతన్ని కైలాసం నుంచి భూమికి వెళ్ళమని ఆదేశించాడు.

అప్పుడు వరాహం.. శివపార్వతులను అభ్యర్థించాడు, అప్పుడు శివుడు ఒక దైవిక శక్తి రూపంలో భూమికి వెళ్లి అక్కడ మానవులను, వారి పంటలను రక్షించమని ఆదేశించాడు. అప్పటి నుండి, వరాహుడు “పంజుర్లీ” దేవత రూపంలో భూమిపై నివసించడం ప్రారంభించాడు. భూమిపై పంటలను రక్షించడం ప్రారంభించాడు. అందుకే ప్రజలు ఆయనను దేవుడిలా పూజించడం ప్రారంభించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు