Pradosh Vratam: ప్రదోష వ్రతం రోజున ఈ 5 వస్తువులను దానం చేయండి.. శివపార్వతుల అనుగ్రహం మీ సొంతం..
బుధ ప్రదోష ఉపవాసం రోజున శివ పర్వతులతో పాటు వినాయకుడిని పూజిస్తారు. అలాగే ప్రదోష వ్రతం రోజున శివుడి పేరు మీద ఆచరిస్తారు. నియమ నిష్టలతో వ్రతం చేస్తే పుణ్య ఫలితాలను పొందుతాడు. బుధ ప్రదోష వ్రతం ఆచరించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే వ్యాపారం, ఉపాధిలో శుభ ఫలితాలను అందుకుంటాడు.
హిందూ మతంలో ప్రదోష వ్రతం అనేది శివుడికి అంకితం చేయబడిన ముఖ్యమైన పూజ. ఈ ప్రదోష వ్రత ఉపవాసం ప్రతి నెల కృష్ణ పక్షం, శుక్ల పక్షం త్రయోదశి తిథి రోజున ఆచరిస్తారు. ఈ రోజున కైలాస పర్వతంలో ఉన్న శివుడు ధ్యానంలో కూర్చుంటాడని..ఆయనను పూజించడం ద్వారా ప్రజలు విశేష ఫలితాలను పొందుతారని నమ్మకం. ప్రదోష వ్రతం రోజున కొన్ని రకాల వస్తువులను దానం చేయడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుందని.. కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. అయితే ప్రదోష వ్రతం రోజున దానం చేయడానికి కొన్ని ప్రత్యేక విషయాలు ఉన్నాయి. వీటిని ప్రత్యేకంగా శివునికి ప్రీతిపాత్రంగా భావిస్తారు.
పంచాంగం ప్రకారం జేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి తేదీ జూలై 3న ఉదయం 7:10 గంటలకు ప్రారంభమై జూలై 4న ఉదయం 5:54 గంటలకు ముగుస్తుంది. ప్రదోష కాలంలో చేసే పూజ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా ఈసారి జులై 3వ తేదీ బుధవారం నాడు ప్రదోష వ్రత ఉపవాసం పాటించనున్నారు.
బుధ ప్రదోష ఉపవాసం రోజున శివ పర్వతులతో పాటు వినాయకుడిని పూజిస్తారు. అలాగే ప్రదోష వ్రతం రోజున శివుడి పేరు మీద ఆచరిస్తారు. నియమ నిష్టలతో వ్రతం చేస్తే పుణ్య ఫలితాలను పొందుతాడు. బుధ ప్రదోష వ్రతం ఆచరించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే వ్యాపారం, ఉపాధిలో శుభ ఫలితాలను అందుకుంటాడు.
ఈ ప్రత్యేక వస్తువులను దానం చేయడం వలన విశిష్ట ఫలితాలు
- గో దానం: ఆవును లక్ష్మీదేవి మరియు విష్ణువు రూపంగా భావిస్తారు. ప్రదోష వ్రతం రోజున గోవును దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. సంపద పెరుగుతుంది.
- నల్ల నువ్వులు నల్ల నువ్వులు శివునికి చాలా ప్రీతికరమైనవి. ప్రదోష వ్రతం రోజున నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. గ్రహసంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి.
- పండ్లు దానం: పండ్లను శివునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రదోష వ్రతం రోజున పండ్లను దానం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. జాతకంలో గ్రహాల స్థితి బలపడుతుంది.
- వస్త్ర దానం వస్త్రదానం చేయడం కూడా పుణ్య కార్యంగా పరిగణించబడుతుంది. ప్రదోష వ్రతం రోజున పేదలకు బట్టలు దానం చేయడం వల్ల శివుడు సంతోషించి జీవితంలో సుఖ సంతోషాలను ఇస్తాడు.
- నీటి దానం నీరు జీవితానికి చాలా అవసరం. ప్రదోష వ్రతం రోజున తాగు నీరుని పక్షులకు దాహార్తులకు అందించడం వలన పుణ్యఫలితాలు కలుగుతాయి, పితృ దోషాలు కూడా తొలగిపోతాయి.
దానం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
ప్రదోష వ్రతం రోజున దానం చేసే ముందు కల్మషం లేని.. స్వచ్ఛమైన మనస్సుతో శివుడిని ధ్యానం చేయండి. దానం చేయడానికి వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు, పేదలకు, నిస్సహాయులకు, ఆపన్నులకు తగిన ప్రాధాన్యత ఇవ్వండి. ఇది శివుని ప్రత్యేక అనుగ్రహాన్ని తెస్తుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఈ వస్తువులను దానం చేస్తే జీవితంలోని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో ఆనందం ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు