Chappan Bhog: జగన్నాథుడుకి 56 రకాల నైవేద్యాలు సమర్పించిన అనంతరం వేప పొడిని ఎందుకు ఇస్తారో తెలుసా..

శ్రీ కృష్ణుని తల్లి యశోద అతనికి రోజుకు ఎనిమిది సార్లు ఆహారం పెట్టేది. ఒకసారి  ఇంద్రదేవుని కోపం నుండి మొత్తం గోకులాన్ని రక్షించడానికి శ్రీ కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం ద్వారా గోకుల  ప్రజలను రక్షించాడు. గోవర్ధన పర్వతాన్ని గోటిన నిలిపిన సమయంలో శ్రీ కృష్ణుడు ఆహారం లేదా నీరు తీసుకోలేదు. ఇంద్రుడు వర్షాన్ని సుమారు 7 రోజులు కురిపిస్తూనే ఉన్నాడు.

Chappan Bhog: జగన్నాథుడుకి 56 రకాల నైవేద్యాలు సమర్పించిన అనంతరం వేప పొడిని ఎందుకు ఇస్తారో తెలుసా..
Puri Jagannath Temple
Follow us
Surya Kala

|

Updated on: Jul 02, 2024 | 6:40 AM

హిందూ మతంలో ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం దేవునికి నైవేద్యాన్ని సమర్పిస్తారు.  వివిధ రకాల పూజల్లో ప్రజలు దేవుళ్లకు ఒకటి, రెండు లేదా గరిష్టంగా తొమ్మిది రకాల వస్తువులను సమర్పిస్తారు. అయితే జగన్నాథునికి మాత్రం 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. జగన్నాథునికి 56 రకాల ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించిన తర్వాత వేప పొడిని కూడా సమర్పించే సంప్రదాయం శతాబ్దాలుగా ఇక్కడ కొనసాగుతోంది.

జగన్నాథునికి 56 రకాల ఆహారాన్ని ఎందుకు సమర్పిస్తారంటే

పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుని తల్లి యశోద అతనికి రోజుకు ఎనిమిది సార్లు ఆహారం పెట్టేది. ఒకసారి  ఇంద్రదేవుని కోపం నుండి మొత్తం గోకులాన్ని రక్షించడానికి శ్రీ కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం ద్వారా గోకుల  ప్రజలను రక్షించాడు. గోవర్ధన పర్వతాన్ని గోటిన నిలిపిన సమయంలో శ్రీ కృష్ణుడు ఆహారం లేదా నీరు తీసుకోలేదు. ఇంద్రుడు వర్షాన్ని సుమారు 7 రోజులు కురిపిస్తూనే ఉన్నాడు. తన కోపం తగ్గి.. 8 రోజువ రోజున  వర్షం ఆగిపోయినప్పుడు శ్రీ కృష్ణుడు గోకుల ప్రజలందరినీ గోవర్ధన పర్వతం కింద నుంచి బయటకు తీసుకుని వచ్చి వారి వారి నివాస ప్రాంతాలకు వెళ్లమని కోరాడు.

ప్రజల కోసం శ్రీ కృష్ణుడు వారం రోజులు ఆకలితో, దాహంతో ఉండటంతో తల్లి యశోద చాలా బాధపడింది. ఆ తర్వాత శ్రీ కృష్ణుని పట్ల తమ ప్రేమ, భక్తిని తెలియజేస్తూ యశోదతో పాటు గోకుల ప్రజలు కలిసి 7 రోజులు ఆహారాన్ని తయారు చేసి కన్నయ్యకు ఆహారాన్ని అందించారు.  రోజుకు 8 సార్లు వారానికి ఏడు రోజులు అంటే  7×8 = 56 రకాల వంటకాలు శ్రీ కృష్ణుడికి నైవేద్యంగా పెట్టారు.

ఇవి కూడా చదవండి

వేప పొడిని ఎందుకు నైవేద్యంగా పెడతారంటే

జగన్నాథునికి 56 నైవేద్యాలు సమర్పించిన తర్వాత వేప పొడిని నైవేద్యంగా సమర్పించడం గురించి అనేక పురాణ కథనాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పూరీలో జగన్నాథునికి ప్రతిరోజూ 56 రకాల వంటకాలు నైవేద్యంగా సమర్పించేవాడు. కుటుంబం లేని.. ఒంటరిగా ఉన్న స్త్రీ.. జగన్నాథుడిని తన కొడుకుగా భావించింది. ఆమె రోజూ గుడికి వెళ్లి స్వామి ముందు కూర్చొని రోజూ భోగం సమర్పించడం చూసేది.

56 ఆహారం తినేసమయంలో ఆలోచన చేసిన స్త్రీ

ఒకరోజు చాలా ఆహారం తిన్న తన కొడుకుకు కడుపునొప్పి వస్తుందనే ఆలోచన ఆ స్త్రీకి వచ్చింది. వెంటనే ఆమె జగన్నాథునికి వేప పొడిని తయారు చేసి.. జగన్నాథుడికి అందించడానికి వచ్చింది. అయితే ఆలయ ద్వారం వద్ద కావాలా నిలబడి ఉన్న సైనికులు ఆమెను చూసి ఆ స్త్రీ చేతిలో ఉన్న వేప పొడిని విసిరి అక్కడి నుంచి తరిమికొట్టాడు. ఆ తర్వాత ఆ మహిళ తన కుమారుడికి ఇంత ఆహారం తిన్నాక కడుపు నొప్పి వస్తుందని భావించి రాత్రంతా ఏడుస్తూనే ఉంది.

కలలో జగన్నాథుడు ప్రత్యక్షం

ఆ స్త్రీ ఏడుస్తూ ఉండడం చూసి జగన్నాథుడు రాజు కలలో కనిపించి తన తల్లికి మందు ఇవ్వడానికి మీ సైనికులు ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించాడు. అంతేకాదు కలలో జగన్నాథుని మాటలు విన్న రాజు ఆ స్త్రీ ఇంటికి వెళ్లి క్షమాపణలు కోరగా, ఆ స్త్రీ మరల వేప పొడిని తయారు చేసి జగన్నాథునికి తినిపించింది. ఆ రోజు నుంచి జగన్నాథునికి 56 నైవేద్యాల తర్వాత వేప పొడిని సమర్పించే సంప్రదాయం మొదలైంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు