Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Masa Shivaratri: ప్రతి నెల శివరాత్రి పండగను ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యత ఏమిటంటే

శివ పార్వతుల ఆశీస్సులు పొందడానికి, భక్తులు ఈ రోజున పూర్తి ఆచారాలు, భక్తితో ఉపవాసం చేసి ఆదిదంపతులను పూజిస్తారు. జేష్ఠ మాసంలో మాస శివరాత్రి 4 జూలై 2024 గురువారం జరుపుకొనున్నారు. అయితే మాస శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు అనే విషయంపై అనేక పురాణ కథలు ప్రబలంగా ఉన్నాయి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Masa Shivaratri: ప్రతి నెల శివరాత్రి పండగను ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యత ఏమిటంటే
Masa Shivaratri Puja
Follow us
Surya Kala

|

Updated on: Jul 01, 2024 | 2:33 PM

హిందూ మతంలో మాస శివరాత్రి పండుగను ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిధిన జరుపుకుంటారు. శివరాత్రి పండుగ శివపార్వతికి అంకితం చేయబడింది. శివ పార్వతుల ఆశీస్సులు పొందడానికి, భక్తులు ఈ రోజున పూర్తి ఆచారాలు, భక్తితో ఉపవాసం చేసి ఆదిదంపతులను పూజిస్తారు. జేష్ఠ మాసంలో మాస శివరాత్రి 4 జూలై 2024 గురువారం జరుపుకొనున్నారు. అయితే మాస శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు అనే విషయంపై అనేక పురాణ కథలు ప్రబలంగా ఉన్నాయి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

మాస శివరాత్రి పండుగను జరుపుకోవడం వెనుక కొన్ని పురాణ కథలు

శివుని వివాహం

పురాణాల ప్రకారం శివ పార్వతి వివాహానికి ప్రతీకగా మాస శివరాత్రి జరుపుకుంటారు. ఈ రోజున పరమశివుడు పార్వతిని తన భార్యగా స్వీకరించాడని నమ్ముతారు.

సముద్ర మథనం

మరొక పురాణం ప్రకారం చతుర్థి తిధి రోజున అంటే మాస శివరాత్రి రోజున సముద్ర మథనం ప్రారంభం అయిందని సూచిస్తుంది. ఈ రోజు నుంచి దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర నుంచి అమృతం కోసం మథనం చేయడం ప్రారంభించారని నమ్మకం.

ఇవి కూడా చదవండి

శివ స్తోత్రం పఠించిన పార్వతీదేవి

మరొక పౌరాణిక కథనం ఏమిటంటే శివుడికి ఒకసారి ఆగ్రహం వచ్చింది. అప్పుడు శివుడి కోపాగ్నితో ప్రపంచం నాశనం అయ్యే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు పార్వతి దేవి శివుడిని స్తుతించి ప్రసన్నం చేసుకుంది. దీంతో శివుని కోపం చల్లారింది. ఈ నమ్మకం కారణంగా ప్రతి నెలా కృష్ణ పక్ష చతుర్థి రోజున మాస శివరాత్రి పండుగను జరుపుకుంటారు.

శివుని తాండవ నృత్యం

మాస శివరాత్రి కూడా శివుని తాండవ నృత్యానికి చిహ్నంగా పరిగణించబడుతుందని కొన్ని పురాణాల కథనం. ఈ రోజున శివుడు విశ్వాన్ని నాశనం చేసి మళ్లీ సృష్టిస్తాడని నమ్ముతారు.

మోక్ష ప్రాప్తి

మాస శివరాత్రి కూడా మోక్షాన్ని పొందే అవకాశంగా భావిస్తారు. ఈ రోజున శివుని పూజించిన భక్తులకు మోక్షప్రాప్తి కలుగుతుంది.

అహం నాశనం

మరొక పురాణం ప్రకారం ఒకప్పుడు విష్ణువు, బ్రహ్మల మధ్య ఎవరు గొప్పవారు అనే విషయంలో వివాదం జరిగింది. వారి వివాదం పెరగడం ప్రారంభించినప్పుడు.. శివుడు అగ్ని స్తంభం రూపంలో కనిపించాడు.. ఈ స్తంభం ఆది అంతాన్ని కనుగొనమని బ్రహ్మ విశ్నువులను కోరాడు. అప్పుడు ఇద్దరూ ఆది అంతాన్ని కొనుగోన లేక తమ తప్పును తెలుసుకున్నారు. అప్పటి నుండి మాస శివరాత్రి రోజున శివుడిని పూజించడం.. శివలింగానికి జలాభిషేకం చేయడం మొదలు పెట్టారు. ఇలా చేయడం వలన మనిషి అహంకారం నాశనం అవుతుందని నమ్ముతారు, అందుకే ప్రతి నెల మాస శివరాత్రి పండుగను జరుపుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు