Heavy Rains: దేశవ్యాప్తంగా వర్షాలు, వరదలు బీభత్సం, జనజీవనం అస్తవ్యస్తం.. పలువురు మృతి

దేశంలో రుతుపవనాలు అడుగు పెట్టాయి. పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ విపత్తు ధాటికి చాలా కుటుంబాలు గల్లంతయ్యాయి. ఈ భారీ వర్షాలు ఆసేతు హిమాచలం విధ్వసం సృష్టిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల వాహనాలు కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల ప్రజలు కొట్టుకుపోయారు. ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి నీరు విధ్వంస కథ ను రాస్తున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో వర్షం కారణంగా 11 మంది మరణించారు. ఇతర నగరాల్లో కూడా చాలా మంది మృత్యువాతపడ్డారు.

Heavy Rains: దేశవ్యాప్తంగా వర్షాలు, వరదలు బీభత్సం, జనజీవనం అస్తవ్యస్తం.. పలువురు మృతి
Heavy Rains In North India
Follow us

|

Updated on: Jul 01, 2024 | 1:18 PM

దేశంలో రుతుపవనాలు అడుగు పెట్టాయి. పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ విపత్తు ధాటికి చాలా కుటుంబాలు గల్లంతయ్యాయి. ఈ భారీ వర్షాలు ఆసేతు హిమాచలం విధ్వసం సృష్టిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల వాహనాలు కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల ప్రజలు కొట్టుకుపోయారు. ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి నీరు విధ్వంస కథ ను రాస్తున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో వర్షం కారణంగా 11 మంది మరణించారు. ఇతర నగరాల్లో కూడా చాలా మంది మృత్యువాతపడ్డారు.

ఢిల్లీలో వర్షం బీభత్సం, 11 మంది మృతి

దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. రుతుపవనాల అడుగు పెట్టి కురిసిన తొలి వర్షంతోనే ఢిల్లీ నగరం జలమయమైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దేశ రాజధాని పరిస్థితి అధ్వానంగా మారింది. ఢిల్లీలో శుక్రవారం రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. రోడ్లన్నీ చెరువులుగా మారాయి. రోడ్లపై కార్లు తేలాయి. పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. దేశ రాజధానిలో వర్షాలకు సంబంధించిన అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. గుంతల్లో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోగా, కొన్ని చోట్ల పైకప్పు కూలి మృత్యువాత పడ్డారు.

ఇవి కూడా చదవండి

ముంబైలో భీకర వరదలు, నీటిలో కొట్టుకుపోయిన ఐదుగురు

ముంబైకి ఆనుకుని ఉన్న లోనావాలాలో వరదల కారణంగా కుటుంబం మొత్తం నీటిలో కొట్టుకుపోయింది. భారీ వర్షాల తర్వాత భూషి డ్యామ్‌ వరద ఉధృతమైంది. ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. కొద్దిసేపటికే బలమైన నీటి ప్రవాహంలో కుటుంబంలోని ఐదుగురు గల్లంతయ్యారు. సమాచారం ప్రకారం ఈ కుటుంబం వారాంతంలో సెలవులు గడపడానికి ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత రంగంలోకి దిగిన లోనావాలా పోలీసులు, శివదుర్గ్ రెస్క్యూ టీమ్ ఇప్పటివరకు 3 మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన రెండు మృత దేహాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. నేవీ బృందం ఈరోజు రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రమాద బాధిత కుటుంబం పూణేలోని సయ్యద్ నగర్ నివాసితులుగా తెలుస్తోంది.

గుజరాత్‌లో వర్షం బీభత్సం

గుజరాత్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అహ్మదాబాద్ సహా పలు నగరాల పరిస్థితి అధ్వానంగా ఉంది. రోడ్లన్నీ కొన్ని అడుగుల మేర నీటితో నిండిపోయాయి. నగరంలో ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. వర్షం నగర వాసుల గమనానికి బ్రేక్ వేసినట్లు అనిపించింది. మెహసానాలోనూ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఇక్కడ 102 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. రోజంతా హైవేపై నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇదిలావుండగా జూలై 3 , 4 రెండు రోజులు దక్షిణ, ఉత్తర గుజరాత్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు, వర్షం కారణంగా సూరత్, అహ్మదాబాద్ సహా అనేక ప్రాంతాల్లో డజన్ల కొద్దీ చెట్లు నేలకూలాయి.

కిష్త్వార్‌లో విరిగిపడ్డ కొండచరియలు

నిరంతర భారీ వర్షాల కారణంగా కిష్త్వార్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. కిష్త్వార్‌లో నాగసేని-పత్తర్ నేకి సమీపంలోని కొండ కూలిపోయింది. కొండ జారడం వల్ల పద్దర్ సబ్ డివిజన్ కిష్త్వార్‌తో సంబంధాన్ని కోల్పోయింది. కొండపై ఏర్పాటు చేసిన ఒక టవర్ కూడా జారి కిందపడిందని చెబుతున్నారు. అదృష్టవశాత్తూ ఈ సమయంలో రహదారిపై వాహనాల కదలికలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రమాదం నుంచి బీఆర్‌ఓ బృందం కూడా తప్పించుకుంది. ఎందుకంటే కొండ జారిపోవడంతో.. BRO బృందం సమీపంలోని రహదారిని మరమ్మతు చేసే పనిలో నిమగ్నమై ఉంది. ప్రస్తుతం కిష్త్వార్‌-పదర్‌ రహదారిపై రాకపోకలను పునరుద్ధరించేందుకు శిథిలాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి.

కేదార్‌నాథ్ ఆలయం సమీపంలో హిమపాతం

ఆదివారం నాడు కేదార్‌నాథ్ ధామ్ సమీపంలో హిమపాతం సంభవించిన ఈ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిల్లా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రకారం, కేదార్‌నాథ్ ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న చోరాబరి నుండి హిమానీనదానికి చెందినపెద్ద భాగం విడిపోయి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. గాంధీ సరోవర్ సమీపంలోని ప్రాంతాలకు హిమానీనదం మంచును తెచ్చిపెట్టింది. అయితే పెద్దగా నష్టం జరగలేదు. కేదార్‌నాథ్ ధామ్ చుట్టూ వాతావరణం వేగంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అమ్డా యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

వర్షం కారణంగా హరిద్వార్‌ అతలాకుతలం

హరిద్వార్‌లో వర్షం విధ్వంసం సృష్టించిన తరువాత.. నది ప్రవాహం నెమ్మదించడంతో సహాయక చర్యల కోసం రెస్క్యు టీం రంగంలోకి దిగింది. శనివారం వరదలో కొట్టుకుపోయిన వాహనాలను నదిలో నుంచి తొలగించే పనులు కొనసాగుతున్నాయి. SDRF బృందం ఇప్పటివరకు నది నుండి 2 డజన్లకు పైగా వాహనాలను బయటకు తీసింది. వరదల కారణంగా నగరంలోని తాగునీటి లైన్లు కూడా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. ఖడ్‌ఖాదీ, భూపత్‌వాలాలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తింది. శనివారం కురిసిన వర్షం కారణంగా నది ఉగ్రరూపం దాల్చి ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టించింది.

అసోంలో వర్షాలు, వరదలు.. 44 మంది మృతి

దిబ్రూఘర్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. రోడ్లు కూడా నదులుగా మారాయి. మరోవైపు బ్రహ్మపుత్ర నది నీటిమట్టం పెరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. దిబ్రూఘర్‌లో నది ప్రమాద స్థాయిని దాటింది. గౌహతిలో వరదలకు సంబంధించి హెచ్చరిక కూడా జారీ చేశారు. నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర సహా 5 నదులు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్రంలో వర్షాలు, వరదలు కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 44 మంది మరణించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..