గరిటడైన చాలు గాడిద పాలు… ఇప్పుడు నెల నెలా లక్షలు సంపాదించే సరికొత్త మార్గం ఇదేనా?

తాజా లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా సుమారు 142 ఫాంలు ఉన్నాయి. ఒక్కో ఫాంలో కనీసం 50 గాడిదలను సాకుతున్నట్టు లెక్కలు చూసినా దాదాపు దేశ వ్యాప్తంగా మరో 7 వేల గాడిదలు అదనంగా ఉండే అవకాశం ఉంది.

గరిటడైన చాలు గాడిద పాలు...  ఇప్పుడు నెల నెలా లక్షలు సంపాదించే సరికొత్త మార్గం ఇదేనా?
Software Engineers Started Donkey Milk Business
Follow us

|

Updated on: Jul 02, 2024 | 10:15 AM

“గంగి గోవు పాలు గరిటెడైనచాలు – కడవడైననేమి కరము పాలు”

ఇక మన వేమన శతకంలో  ఈ పద్యాన్ని తెలుగు వాళ్లం  పక్కన పెట్టెయ్యాలేమో… లేదంటే మొదటి రెండు పాదాలను తిప్పి చెప్పుకోవాలా.. అని కూడా అనుకోక తప్పదు. అవును ఆవు పాల కన్నా గాడిద పాలే ఎక్కువ ప్రియమమవుతున్నాయి. కోపం వస్తే గాడిద అని తిట్టడం, ఎక్కువ పని చేయిస్తే.. గాడిద చాకిరీ అనుకోవడం.. తెలుగు వాళ్లకు సర్వ సాధారణం. కానీ ఇప్పుడు అలా అనుకోవడానికి కూడా గాడిదలు ఛాన్సు ఇవ్వడం లేదు. ఆవుల్ని, గేదెల్ని పెంచినట్టు తెలుగు నాట గాడిదల్ని కూడా పెంచుతుంటారు కానీ కేవలం దానితో బరువులు మోయించుకోవడానికి. అది కూడా ఇప్పుడు కాదు యంత్ర సాయం పెద్దగా అలవాటు కాని సమయంలో గాడిదల్ని కొన్ని జాతుల వాళ్లు పెంచే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

నగర జనాలకు చాలా మందికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పల్లెల్లో అలాగే హైదరాబాద్ సహా మరి కొన్ని  ప్రాంతాల్లో ఉదయాన్నే గాడిద పాలు అమ్మడం మామూలు విషయమే. ముఖ్యంగా ఆ పాలలో ఔషధ గుణాలుంటాయని, చిన్నపిల్లలకు పడితే మంచిదన్నది కొంత మంది నమ్మకం. అందుకే వాటికి అంతో ఇంతో డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.

Donkey's farm in AP

Donkey’s farm in AP

సరే ఈ విషయం చాలా మందికి కొత్త కావచ్చు. కానీ.. ఇకపై మాత్రం గాడిద పెంపకాలు, గాడిద పాలు విక్రయాలు, గాడిద పాలను పాల పౌడర్‌గా చేసి ఆన్ లైన్లో కూడా అమ్మడాలు మామూలు విషయంగానే మారిపోనుంది. వాస్తవానికి మారిపోనుండటం కాదు.. మారిపోయింది కూడా. కొద్ది రోజుల క్రితం గుజరాత్‌లో 42 గాడిదలతో ఓ డెయిరీ ఫాం ఏర్పాటు చేయడంతో నేషనల్ మీడియాకు అప్పట్లో అదో పెద్ద వార్తగా మారిపోయింది.  నిజానికి ఈ పాల వినియోగం అంతంత మాత్రంగానే ఉండే ఆంధ్రప్రదేశ్‌లోనే దాదాపు రెండున్నరేళ్ల క్రితమై ఈ తరహా ఫాంను ఏకంగా ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు స్టార్ట్ చేశారు. అక్షయ డాంకీ ఫాం పేరుతో రాజమండ్రికి సమీపంలోని రాజానగరంలో మొదలుపెట్టారు. మొత్తం 20 ఎకరాల్లో  దీన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వహాకులు టీవీ9తో చెప్పారు. గాడిదల పెంపకానికి అవసరమైన అన్ని ఏర్పాట్లతో కూడిన ఫాం అది. వాటి ఆహార అవసరాలకు అవసరమైన పంటల్ని కూడా అక్కడే పండిస్తున్నారు. దేశ, విదేశాల్లో దీనికి ఉన్న డిమాండ్‌ను చూసి, ఏడాది పాటు ఈ పరిశ్రమ గురించి రిసెర్చ్ చేశామని, ఇంట్లో వాళ్లు మొదట్లో పెద్దగా ఆసక్తి చూపించనప్పటికీ  వాళ్లకు పూర్తిగా వివరించి వాళ్లను ఒప్పించి వ్యాపారం ప్రారంభించామని ఆ సంస్థ నిర్వహాకులు వెంకటరమణ టీవీ9తో చెప్పారు.

Akshya Donkey Farm

Akshya Donkey Farm

తెలంగాణలో ఎప్పటి నుంచో గాడిద పాల అమ్మకం ఉన్నప్పటికీ దాన్ని ఒక పరిశ్రమ రూపంలో తీసుకొచ్చింది మాత్రం 2022లోనే. మహబూబ్ నగర్ జిల్లాలో  శివ శక్తి డాంకీ ఫామ్స్ పేరుతో దాదాపు 28 ఎకరాల్లో 50కి పైగా గాడిదల్ని పెంచుతున్నారు. ఇది తెలంగాణలోనే తొలి గాడిదల డెయిరీ ఫాం కాగా.. దేశంలో రెండోదిగా గుర్తింపు పొందింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 3 గాడిదల ఫాంలు ఉండగా.. తెలంగాణలో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలో ఇంకొకటి నల్గొండ జిల్లాలో ఉన్నాయి. ఏపీలో రాజమండ్రి సమీపంలోని రాజా నగరం వద్ద ఉంది.

దేశంలోనే మొట్ట మొదటి గాడిదల ఫాం తమిళనాడులో బాబు అనే ఔత్సాహికుడు ఏర్పాటు చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వెబ్ సైట్ – ICAR అందించిన వివరాల ప్రకారం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని ముక్కుదల్ గ్రామంలో దేశంలోనే మొదటి డాంకీ ఫాం ఏర్పాటయ్యింది. ICAR-NRCEల సహకారంతో THE DONKEY PALACE పేరుతో ప్రారంభించారు. మొదట తక్కువ స్థాయిలో మొదలైనా క్రమంగా  ఇప్పుడు సుమారు 5 వేల గాడిదల్ని పెంచే స్థాయికి ద డాంకీ పేలస్ ఎదిగింది. రోటిన్ కి భిన్నంగా ఆలోచించడంలో ముందుండే బాబు.. కాస్త వినూత్నంగా ఆలోచించి ఫ్రాంచైజీ ఫార్మూలాను గాడిదల పెంపకంలో కూడా ఉపయోగించారు. ఫలితంగా 75 ఫ్రాంచైజీలతో 5 వేల గాడిదల్ని ద డాంకీ పేలస్ సాకుతోంది.  అంతరించిపోతున్న గాడిదల సంఖ్యను పెంచడమే కాదు, వాటి వల్ల మనకెన్ని లాభాలున్నాయో  ప్రజలకు చెప్పాలనుకునే ఈ వ్యాపారం మొదలుపెట్టినట్టు తన లింక్డిన్ అకౌంట్లో బాబు పేర్కొన్నారు.

The Donkey Palace, Tamil Nādu

The Donkey Palace, Tamil Nādu

లైవ్ స్టాక్ సెన్సెస్ లెక్కల ప్రకారం దేశం మొత్తం ఉన్న గాడిదల్లో రాజస్థాన్లో 2019 నాటికి అత్యధికంగా 23వేల గాడిదలు ఉండగా, మహారాష్ట్రలో  18 వేల గాడిదలతో రెండో స్థానంలో ఉంది. ఇక  కేవలం 5వేల గాడిదలతో ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో ఉంది. అయితే ఆ తర్వాత చాలా రాష్ట్రాల్లో గాడిదల ఫాంలు పెరిగాయి. తాజా లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా సుమారు 142 ఫాంలు ఉన్నాయి. ఒక్కో ఫాంలో కనీసం 50 గాడిదలను సాకుతున్నట్టు లెక్కలు చూసినా దాదాపు దేశ వ్యాప్తంగా మరో 7 వేల గాడిదలు అదనంగా ఉండే అవకాశం ఉంది.

ఏ రాష్ట్రంలో ఎన్నెన్ని?

Number of Donkeys in various states in India

ఉద్యోగం చెయ్యడం కన్నా గాడిదలు కాసుకోవడం బెటరా..?

గడిచిన 4 నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు లక్ష మంది  ఉద్యోగాలు కోల్పోయారన్నది జులై 1 , 2024 నాటికి https://layoffs.fyi/ అంచనా. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితమే ఏపీలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కలిసి ఓ గాడిదల ఫాం నెలకొల్పారు. రోజుకు అప్పట్లోనే 35 లీటర్లు పాలు సేకరిస్తూ నెలకు దాదాపు 2 నుంచి 3 లక్షల ఆదాయం సంపాదించారు. కొద్ది రోజుల క్రితం గుజరాత్‌కు చెందిన ధీరేన్ సోలంకీ 42 గాడిదలను పెంచుకుంటూ నెలకు సుమారు 3 లక్షలు సంపాదిస్తున్నారని అన్ని జాతీయ ఛానెళ్లలో, సోషల్ మీడియాల్లో ప్రముఖంగా ప్రసారమయ్యింది. మొదట 6 నెలలు పెద్దగా వ్యాపారం నడవకపోయినా.. ముఖ్యంగా దక్షిణాదికి తన గాడిద పాలను ఎగుమతి చెయ్యడంతో ఒక్కసారిగా తన వ్యాపారంలో మార్పు వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. దక్షిణాదిలో గాడిదల ఫాం గురించి విని స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. అది లాభసాటి వ్యాపారమని భావించి, 22 లక్షల పెట్టుబడితో 20 గాడిదల్ని కొన్నారు. మొదటి ఐదు నెలలు పెద్దగా వ్యాపారం లేదు. తర్వాత దక్షిణాదికి సరఫరా చెయ్యడం మొదలు పెట్టానని, దాంతో పరిస్థితిలో మార్పొచ్చిందని మీడియాతో చెప్పారు ధీరేన్.

Dhiren Solanki, Gujarat

Dhiren Solanki, Gujarat

ఈ రెండు సంఘటనలు కేవలం ఉదాహరణలు మాత్రమే. ప్రస్తుతం దేశంలో ఆవు పాల ధర లీటరు సుమారు 60 నుంచి 100 రూపాయల మధ్య ఉండగా, గాడిద పాలు లీటరు 3 వేల నుంచి 6 వేల వరకు పలుకుతోంది. ఇప్పుడిప్పుడే గాడిద పాల ఉపయోగం గురించి జనం కూడా గుర్తిస్తూ ఉండటంతో ఇటీవల కాలంలో ఈ రంగంవైపు వస్తున్న యువత సంఖ్య క్రమంగాపెరుగుతూ వస్తోంది.

గాడిద పాలకు అంత చరిత్ర ఉందా?

కొన్ని వేల ఏళ్ల క్రితమే గాడిద పాల వినియోగం ఉందన్నది చరిత్ర చెబుతున్న సత్యం. 460-370 BC కాలంలోనే గాడిద పాల వినియోగం గురించి హిప్పోక్రాట్స్ ప్రస్తావించారు. అప్పట్లోనే గాడిద పాలకు ఔషధ గుణాలన్నాయన్న సంగతిని గుర్తించినట్టు చరిత్ర చెబుతోంది. తల్లిపాలతో సమానంగా ఇందులో విశిష్టమైన గుణాలున్నాయన్న కారణంగా 19 శతాబ్దంలో అనాథ పిల్లలకు వీటిని నేరుగానే ఇచ్చేవారట. 20వ శతాబ్దంలో నీరసంగా, బలహీనంగా ఉన్న పిల్లలకు, జబ్బు పడ్డ పిల్లలకు కూడా గాడిద పాలను పట్టేవారు. ఫ్రాన్స్‌లో పెద్దలు కూడా తీసుకునే వారు. ముందే చెప్పినట్టు ఇందులోని ఔషధ గుణాలు తల్లిపాలకు దగ్గరగా ఉంటాయన్నది వైద్య లోకం చెబుతున్న మాట. ఒక్క కొవ్వు శాతం మాత్రం తక్కువగా ఉంటుంది.  గాడిదపాలు, ఆవు పాలు, బర్రె పాలు, తల్లిపాలు మధ్య వ్యత్యాసాన్ని, అందులో ఉండే పోషక విలువల శాతాన్ని కింద పట్టికలో చూడొచ్చు.

Gross Composition of Milks of Donkey, Human, Cow and Buffalo

Gross Composition of Milks of Donkey, Human, Cow and Buffalo

ఈ పాలలో తక్కువ క్యాలరీలు ఉన్నందున డైట్ పాటించే వారికి మేలు చేస్తాయని Food Safety and Standards Authority of India(https://www.fssai.gov.in/upload/uploadfiles/files/Guidance%20document%20on%20donkey%20milk.pdf) చెబుతోంది. ఒక వేళ చిన్నపిల్లలకు, పిల్లలకు ఇస్తే సప్లిమెంట్స్ యాడ్ చెయ్యాల్సి ఉంటుంది. ఇందులో ప్రోటీన్ల శాతం తక్కువగా ఉంటుంది. అయితే అమినో యాసిడ్స్ మాత్రం తల్లిపాలతో సమానంగా ఉంటాయి. అలాగే విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఈ ఇందులో ఉంటాయి.  అజీర్ణ సమస్యలకు, గ్యాస్ట్రిక్ అల్సర్లకు చక్కని ఫలితం గాడిద పాల వల్ల ఉంటుందన్నది నిపుణుల మాట. ఇక కాస్మెటిక్స్ విషయానికొస్తే  ఎక్కువగా చర్మ సంరక్షణ, చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో గాడిదపాలను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా గాడిద పాలతో తయారు చేసిన సౌందర్య ఉత్పత్తుల వల్ల చర్మం మరింత నునుపుగా మారి మెరిసిపోతుంది. డ్రైనెస్ కూడా తగ్గుతుంది.

Donkey's Milk Market World wide

Donkey’s Milk Market World Wide

ప్రపంచ వ్యాప్తంగా  గాడిద పాల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా గాడిద పాల మార్కెట్ 24.79 మిలియన్ డాలర్లుగా ఉంది. 2032 నాటికి  ఇది 59.07 మిలియన్ డాలర్లకు చేరుతుందన్నది మార్కెట్ వర్గాల అంచనా. ఏటా 9.1శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాయి.

Donkey Milk

Donkey Milk

ఎందుకు తగ్గిపోతున్నాయ్?

ఒకప్పుడు బరువులు మొయ్యడానికి గాడిదల్నే ఉపయోగించే వాళ్లు. దాంతో ప్రతి ఊళ్లోనూ వాటిని పెంచుకునే వాళ్లు కనిపిస్తుండేవారు. జనం యంత్రాల సాయం తీసుకోవడం మొదలైన తర్వాత గాడిదలకు పని తగ్గిపోయింది. ఫలితంగా జనం కూడా వాటి పట్ల ఆసక్తిని తగ్గించుకుంటూ వచ్చారు. దాంతో వాటి సంఖ్య క్రమంగా తగ్గడం మొదలైంది. అంతే కాదు. గాడిదల మాంసానికి కూడా మంచి డిమాండ్ ఉంది. గాడిదల మాంసాన్ని అమ్మడం అక్రమం అయినప్పటికీ పెద్ద ఎత్తున దేశ, విదేశాలకు మాంసాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా గాడిదల మాంసానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. ఆ మాంసాన్ని తినడం వల్ల వెన్ను నొప్పి, ఆస్త్మా వంటి రోగాలు దరి చేరవన్నది జనం నమ్మకం అంతే కాదు ఆ మాంసం తింటే పురుషుల్లో సెక్స్ సామర్థ్యం పెరుగుతుందన్న నమ్మకాలు కూడా ఉన్నాయి. అలాగే ఎక్కువగా గాడిదల చైనాకు అక్రమ రవాణా జరుగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా చైనాలో సంప్రదాయ మెడిసిన్ తయారీలో, కాస్మోటిక్స్ తయారీలో గాడిదల చర్మాన్ని వినియోగిస్తారు. గాడిదల చర్మాన్ని వేడి నీటితో ఉడికించి గిలిటెన్ లాంటి పదార్థాన్ని తయారు చేస్తారు. అది కాస్మోటిక్స్‌లోనూ, వివిధ వ్యాధులకు మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు.

అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? కొవ్వును వెన్నలాకరిగించాలంటే
అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? కొవ్వును వెన్నలాకరిగించాలంటే
తప్పతాగి.. పిచ్చి పిచ్చిగా చేసి.. నెట్టింట హీరోయిన్ వీడియో వైరల్
తప్పతాగి.. పిచ్చి పిచ్చిగా చేసి.. నెట్టింట హీరోయిన్ వీడియో వైరల్
బిగ్ బాస్ 8లోకి ముగ్గురు.. ఇక షో దబిడి దిబిడే
బిగ్ బాస్ 8లోకి ముగ్గురు.. ఇక షో దబిడి దిబిడే
గుడ్ న్యూస్.. తెరపైకి వస్తున్న జూనియర్ లయన్‌
గుడ్ న్యూస్.. తెరపైకి వస్తున్న జూనియర్ లయన్‌
ఈసీజన్‌లో రోజుని హెర్బల్‌టీతో ప్రారంభించండి అనేక ఆరోగ్యప్రయోజనాలు
ఈసీజన్‌లో రోజుని హెర్బల్‌టీతో ప్రారంభించండి అనేక ఆరోగ్యప్రయోజనాలు
ఇకపై నా కొడుకు వస్తాడు.. వారసుడిని రంగంలోకి దించిన లారెన్స్‌
ఇకపై నా కొడుకు వస్తాడు.. వారసుడిని రంగంలోకి దించిన లారెన్స్‌
రోజుకు రూ.100 కోట్లు.. మొత్తంగా చూస్తే.. కుప్పలుగా కోట్లలో డబ్బుల
రోజుకు రూ.100 కోట్లు.. మొత్తంగా చూస్తే.. కుప్పలుగా కోట్లలో డబ్బుల
బెదిరించి తీసుకువెళ్లాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన యువతి
బెదిరించి తీసుకువెళ్లాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన యువతి
మాంసాహారం లేనిదే ముద్ద దిగదా..! ఈ సీజన్‌లో ఈ ఆహారం తినొద్దు
మాంసాహారం లేనిదే ముద్ద దిగదా..! ఈ సీజన్‌లో ఈ ఆహారం తినొద్దు
కంగనాను కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‏కు ఊహించని షాక్..
కంగనాను కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‏కు ఊహించని షాక్..