04 December 2025

చాణక్య నీతి : ఎవరి ఇంటిలో ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదో తెలుసా?

samatha

Pic credit - Instagram

ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి అంటారు. ముఖ్యంగా చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో శరీరానికి వెచ్చదాన్ని ఇచ్చే ఫుడ్ తినాలి అంటారు.

అయితే శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ఆహారాల్లో వేరుశెనగలు కూడా ఒకటి. చలికాలంలో వీటిని తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖ్యంగా వేరుశెనగలతో తయారు చేసిన పీనట్ బటర్ ‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని మీ ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిదంట.

దీనిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ఐరన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి.

అందువలన చలికాలంలో పీనట్ బటర్ తినడం వలన ఇది గుండె సంబంధిత సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువలన శీతాకాలంలో పీనట్ తినడం వలన ఇది శరీరంలో కొత్త రక్తం పుట్టడానికి దోహదపడుతుంది.

ప్రతి రోజూ పీనట్ బటర్ తినడం వలన ఇది జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేసి, మలబద్ధకం, అల్సర్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అయితే దీనిని తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీనిని అతిగా తీసుకోకూడదంట. దీనిని మితంగా తినడం వల్లన్నే మంచి లాభాలు ఉంటాయి.