శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండాలా? ఖాళీ కడుపుతో వీటిని తినండి
05 December 2025
TV9 Telugu
TV9 Telugu
అల్లాన్ని మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. శీతాకాలంలో దీని వల్ల వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే అల్లం సహజసిద్ధమైన యాంటీ బయాటిక్, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటుంది
TV9 Telugu
అలాగే ఇందులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. కనుక ఇది ఒక్కటే అనేక ఇన్‌ఫెక్షన్లకు మందుగా పనిచేస్తుంది
TV9 Telugu
అల్లంలో జింజరాల్, టర్పెనాయిడ్స్, షోగోల్స్, జెరుమ్‌బొన్, జింజరోన్ అనే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అలాగే శక్తివంతమైన ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి
TV9 Telugu
ఇవన్నీ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. బ్యాక్టీరియా, వైరస్‌లపై పోరాటం చేస్తాయి. కనుక అల్లం రసంను రోజూ తీసుకుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది
TV9 Telugu
దీన్ని రోజుకు 2 సార్లు భోజనానికి ముందు ఒక టీస్పూన్ మోతాదులో తాగాలి. దీని వల్ల అన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోతాయి. ముఖ్యంగా బ్యాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్‌ల వల్ల వచ్చే జ్వరం తగ్గుతుంది
TV9 Telugu
అల్లం రసం తాగకపోయినా నేరుగా చిన్న అల్లం ముక్కను తీసుకుని నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తున్నా కూడా ఉపయోగం ఉంటుంది
TV9 Telugu
అల్లం మాదిరే వెల్లుల్లి కూడా ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిలో ఆల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్‌లపై పోరాటం చేస్తుంది. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. రోజూ ఉదయం పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే మంచిది
TV9 Telugu
వీటిని నేరుగా తినవచ్చు. లేదా కాస్త వేయించి కూడా తినవచ్చు. అలాగే తేనె కూడా ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగాలను నయం చేస్తాయి