రవికుమార్ పాణంగిపల్లి. దాదాపు 19 ఏళ్లుగా ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో పాత్రికేయునిగా పని చేస్తున్నారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో శిక్షణ అనంతరం ఈటీవీతో కెరియర్ ప్రారంభించారు. అనంతరం ఎన్టీవీలో స్టోరీ బోర్డ్ ఎడిటోరియల్ ప్రోగ్రామ్ కోసం సుమారు ఏడాదిన్నర పాటు స్క్రిప్ట్ రైటర్, ప్రొడ్యూసర్‌గా పని చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో సీనియర్ జర్నలిస్టుగా, జీ 24 గంటలులో ఔట్ పుట్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2017 నుంచి 2022 వరకు ఐదేళ్ల పాటు బీబీసీ వరల్డ్ సర్వీసెస్‌లో బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుగా పని చేశారు. ప్రస్తుతం టీవీ9 డిజిటల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సమకాలీన స్థానిక, జాతీయ రాజకీయాలపై విశ్లేషణలు… అంతర్జాతీయ, ఫీచర్ కథనాలు రాస్తుంటారు.