ఒకే ఒక్కడు… 2 రాష్ట్రాల ప్రజల పాలిట దేవుడయ్యాడు!
సరిగ్గా అప్పుడు వచ్చారు ఓ పెద్దాయన. వయసు 80 ఏళ్లు. వయసు శరీరానికే తప్ప... తనలోని ఆలచనలకు, తనలో నైపుణ్యాలకు, మరీ ముఖ్యంగా తన మనసుకు కాదన్నది ఆయన మాట. కేవలం మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా చూపించిన తెలుగు జాతి గర్వించదగ్గ ఇంజనీర్... ప్రాజెక్టులకు ఉపద్రవాలు వచ్చినప్పుడల్లా వెంటనే గుర్తొచ్చే వ్యక్తి ఆయన. ఆయనే నాగినేని కన్నయ్యనాయుడు.

70 ఏళ్ల క్రితం కట్టిన ప్రాజెక్టు… ఆ ప్రాజెక్టు గేట్ల జీవిత కాలం సుమారు 45 ఏళ్లు. కానీ మరో 35 ఏళ్లు అదనంగా పని చేసింది. భారీ వర్షాలు , వరదలకు చాలా రోజుల తర్వాత తుంగభద్ర నిండటమే కాదు.. దిగువకు కూడా భారీగా నీళ్లు వదలాల్సి వచ్చింది. కాస్త వర్షాలు తగ్గడంతో గేట్లన్నీ మూసేసి… నీటిని నిల్వ చేసారు అధికారులు. నిండు కుండలా ఉన్న ప్రాజెక్టును చూసి.. ఈ ఏడాది రాయలసీమ, తెలంగాణ రైతులకు నీటి ఇబ్బందులు ఉండవనే అనుకున్నారంతా. తుంగభద్ర నది కర్నాటకలోని రాయచూరు నుంచి మంత్రాలయం మీదుగా ఏపీ,తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులకు చేరుకుంటుంది. నిజానికి అక్కడ ఈ నది రెండు రాష్ట్రాలకు బోర్డర్ నదిలానే ఉంటుంది. కర్నూలు వచ్చిన తర్వాత కృష్ణలో కలుస్తుంది. అందుకే ఈ నదిపై ఉన్నప్రాజెక్టులు నిండాయంటే రాయలసీమ, తెలంగాణ రైతులకు కాస్త ఊరట. కానీ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లేస్తూ ఒక్కసారిగా తుంగ భద్ర నది డ్యామ్‌లో 19వ నెంబర్ గేటు ఆగస్టు 10వ తేదీ రాత్రి కొట్టుకుపోయింది. అంతే.. ఒక్కసారిగా కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది. దాంతో ఆ ఒక్క గేటుపై ఒత్తిడి పడి ప్రాజెక్టు మనుగడకే ప్రమాదం ఉండటంతో మరో దారి లేక మొత్తం గేట్లన్నీ ఎత్తేశారు. ఫలితంగా సుమారు 60 టీఎంసీల నీరు వృథాగా దిగువకు వచ్చేసింది. ఇక ఆ డ్యామ్ ఖాళీ అయిపోతే సరిహద్దు...