ఢిల్లీ నుంచి నైనిటాల్ పర్యాటకానికి వచ్చిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. క్యాబ్ డ్రైవర్ లైంగికంగా వేధించడంతో ప్రాణభయంతో అడవిలోకి పారిపోయింది.. ఆ తర్వాత, రాత్రంతా చీకటిలో గడిపింది. మరుసటి రోజు పోలీసులు బాధితురాలిని రక్షించి, డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.