ఇంత అందమైన భామను దర్శకనిర్మాతలు పట్టించుకోవడంలేదే..!

Rajeev 

08  march 2026

అందం అభినయం ఉన్నా అదృష్టం కలిసిరాని హీరోయిన్స్ లో సిమ్రాన్ చౌదరి ఒకరు. ఈ అమ్మడి అందానికి ఫిదా అవ్వనివారు ఉండరు. 

చాలా మంది హీరోయిన్స్ ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకుంటారు అలాంటి వారిలో సిమ్రాన్ చౌదరి ఒకరు. ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. 

 ఈ నగరానికి ఏమైంది సినిమా హిట్ అయినప్పటికీ సిమ్రాన్ చౌదరికి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు.

దాంతో అంతగా క్రేజ్ కూడా తెచ్చుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. నటన పరంగా హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.

ఇక చేసిన ఒకటి రెండు సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పటి వరకు ఆరు చిత్రాల్లో నటించిన సిమ్రాన్ చౌదరికి ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమానే గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఇక పోతే సిమ్రాన్ సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.

నెట్టింట ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. దాంతో ఈ ఫోటోల పై కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.