Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: బాబోయ్.. అలా ఎలా బ్రో..! నీళ్లలో ఈత కొడుతుండగా షర్టులో దూరిన భారీ విషసర్పం..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, చెరువులు నిండు కుండలా పొంగి పొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. దీంతో కొందరు పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షించేందుకు జలాశయాల వద్దకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కూడా..

Viral video: బాబోయ్.. అలా ఎలా బ్రో..! నీళ్లలో ఈత కొడుతుండగా షర్టులో దూరిన భారీ విషసర్పం..
Snake Found Inside A Mans Shirt
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 20, 2024 | 10:16 AM

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, చెరువులు నిండు కుండలా పొంగి పొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. దీంతో కొందరు పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షించేందుకు జలాశయాల వద్దకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కూడా సరదాగా ఈత కొట్టేందుకు ఓ డ్యామ్‌ వద్దకు వెళ్లాడు. పాల పుంతలా పొంగి పొర్లుతున్న నీళ్లతో స్నానం చేయాలని ఉవ్విళ్లూరాడు. అంతే పోయి ఒక్క గెంతులో నీళ్లలోకి దూకేశాడు. కాసేపు బాగానే ఉన్నా.. ఇంతలో ఏదో అతడి చొక్కాలోకి దూరినట్లు అనిపించింది. ఆనక అది నడుమంతా చుట్టేసుకోసాగింది. ఏదో తేడాగా అనిపించినట్లు భావించిన సదరు వ్యక్తి.. ఒడ్డుకు పరుగులు తీసుకుంటూ వచ్చాడు. చొక్కా ఎత్తిపట్టుకుని, అతడి నడుమును చుట్టుకున్న దాన్ని విదిలించారు. కింద పడిన దాన్ని చూసి భయంతో బిక్కసచ్చిపోయాడు.. అసలింతకీ అతడి షర్టులో దూరిందేమిటో తెలుసా? పా..పా.. పామండీ! పామును దూరం నుంచి చూస్తేనే ముచ్చెమటలు పట్టేస్తాయి. అలాంటిది ఏకంగా ఒంటినే చుట్టేసుకునే సరికి.. పాపం అతగాడి పరిస్థితి చూడాలి. పామును విదిలించి.. వెనక్కి చూడకుండా పరుగు లంకించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మీరూ చూసేయండి.

సాధారణంగా వర్షాకాలంలో పాములు బెడద కాస్త ఎక్కువగానే ఉంటుంది. అడవులు, కొండ ప్రాంతాలు, దట్టమైన చెట్లు, పొలాలు ఉన్న చోట్ల పాములు వర్షం దాటికి బయటకు వస్తుంటాయి. కొన్ని సార్లు జనవాసాల్లోకి కూడా వస్తుంటాయి. అయితే చాలా మంది పాముల్ని చూడగానే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇచ్చి, పాముకు ఎలాంటి ఆపద కల్గించకుండానే వాటిని పట్టించే ప్రయత్నం చేస్తుంటారు. మరి కొంత మందేమో భయంతో పాములపై దాడులు చేస్తుంటారు.

ఇవి కూడా చదవండి

తాజా ఘటన ఎక్కడ జరిగిందో తెలియదుగానీ.. డ్యామ్‌ నీళ్లలో దిగిన అతడి దుస్తుల్లోకి భారీ సైజులో ఉన్న విష సర్పం దూరింది. అయితే అది కాటు వేయకపోవడంతో హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాబోయ్.. ఇదెక్కడి ట్విస్ట్ అంటూ ఫన్నీ గా కామెంట్లు చేస్తున్నారు. వర్షాకాలంలో ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడాలంటే నీళ్లలోకి దిగకపోవడమే మంచిదంటూ హితవు పలుకుతున్నారు. మీరు మాత్రం నీళ్లను చూసి కమిట్‌ అవ్వకంటే! ఏమో.. ఏ నీళ్లలో ఏ పాము దాగుందో..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.