AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అమెరికాలో ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి.. ఏం జరిగిందంటే

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బుచ్చిబాబు (40) అమెరికాలోని మృతి చెందాడు. కాలిఫోర్నియాలో బీచ్‌కు వెళ్లిన అతడు ఆదివారం ప్రమాదవశాత్తు నీటమునిగి మృత్యువాత పడ్డాడు. మృతుడు ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామానికి చెందిన దొద్దాల కోటేశ్వరరావు కుమారుడు బుచ్చిబాబుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుచ్చిబాబు కాలిఫోర్నియాలో..

Andhra Pradesh: అమెరికాలో ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి.. ఏం జరిగిందంటే
Software Employee Buchi Babu
Srilakshmi C
|

Updated on: Aug 19, 2024 | 11:55 AM

Share

ఒంగోలు, ఆగస్టు 19: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బుచ్చిబాబు (40) అమెరికాలోని మృతి చెందాడు. కాలిఫోర్నియాలో బీచ్‌కు వెళ్లిన అతడు ఆదివారం ప్రమాదవశాత్తు నీటమునిగి మృత్యువాత పడ్డాడు. మృతుడు ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామానికి చెందిన దొద్దాల కోటేశ్వరరావు కుమారుడు బుచ్చిబాబుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుచ్చిబాబు కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా గత పదేళ్లుగా పనిచేస్తున్నాడు. వీకెండ్‌ కావడంతో శనివారం సాయంత్రం ఫ్యామిలీతో కలిసి సరదాగా బీచ్‌కు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ బీచ్‌లో నీటమునిగి మృతి చెందాడు. కుమారుడు మృతి చెందిన విషయం తెలియడంతో స్వగ్రామంలోని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బుచ్చిబాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. బుచ్చిబాబు భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ముండ్లమూరు పోలీసులను వివరణ కోరగా.. ఇంతవరకూ తమను ఎవరూ సంప్రదించలేదని తెలిపారు.

ప్రేమ పేరిట ఆకతాయి వేధింపులు.. తాళలేక పాలిటెక్నిక్‌ విద్యార్థిని సూసైడ్‌

వారిది చిన్న కుటుంబం. తల్లిదండ్రులకు ఇద్దరే సంతానం. అక్కా తమ్ముళ్లిద్దరికీ ఒకరంటే మరొకరికి అమితమైన ప్రేమ. ఉన్నత చదువులు చదివి గొప్ప ఉద్యోగం చేయాలని కలలు కనింది ఆ బాలిక. కానీ ఆమె ఆశలను ఓ ఆకతాయి మొగ్గలోనే తుంచేశాడు. అతడి వేధింపులకు తాళలేక బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ.. తన తమ్ముడికి, పెదనాన్న కుమారుడికి రాఖీలు కట్టి కొద్ది గంటల్లోనే కన్నుమూసింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన విద్యార్థిని (17) కోదాడలో పాలిటెక్నిక్‌ కాలేజీలో ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. అయితే ఖమ్మం పట్టణానికి చెందిన ఓ ఆకతాయి నిత్యం బాలికను ప్రేమ పేరిట వేధించసాగాడు. మనస్తాపం చెందిన బాలిక గత గురువారం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రక్షాబంధన్‌ వరకు తాను ఉంటానో లేదోనని.. శనివారమే తన తమ్ముడితోపాటు పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టింది. అనంతరం ఆదివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో కన్నుమూసింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఆకతాయిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు నర్సింహులపేట పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.