AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC Bus Accident: ఓరి దేవుడో..! ప్రయాణికులతో వెళ్తుండగా.. రన్నింగ్‌లో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు

సుమారు 170 మందితో ప్రయాణికులను ఆ ఆర్టీసీ బస్సు గమ్యస్ధానానికి తీసుకెళ్తుంది. రోడ్డుపై పరుగులు తీస్తున్న బస్సులోని ప్రయాణికులంతా నిశ్చింతగా ఉన్నారు. కానీ ఇంతలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. బస్సు వెనుక టైర్లు ఉన్నట్టుండీ ఊడిపోయి తలో దిక్కూ వెళ్లిపోయాయి. దీంతో బస్సు వెనుక భాగం రోడ్డుకు రాసుకుంటూ కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. సమయానికి బస్సు..

TGSRTC Bus Accident: ఓరి దేవుడో..! ప్రయాణికులతో వెళ్తుండగా.. రన్నింగ్‌లో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు
TGSRTC Bus Accident
Srilakshmi C
|

Updated on: Aug 18, 2024 | 9:50 AM

Share

జగిత్యాల, ఆగస్టు 18: సుమారు 170 మందితో ప్రయాణికులను ఆ ఆర్టీసీ బస్సు గమ్యస్ధానానికి తీసుకెళ్తుంది. రోడ్డుపై పరుగులు తీస్తున్న బస్సులోని ప్రయాణికులంతా నిశ్చింతగా ఉన్నారు. కానీ ఇంతలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. బస్సు వెనుక టైర్లు ఉన్నట్టుండీ ఊడిపోయి తలో దిక్కూ వెళ్లిపోయాయి. దీంతో బస్సు వెనుక భాగం రోడ్డుకు రాసుకుంటూ కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. సమయానికి బస్సు డ్రైవర్‌ బ్రేక్‌ వయకుంటే వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ భయానక సంఘటన జగిత్యాల జిల్లా రాయికల్‌ ప్రధాన రహదారిపై శనివారం (ఆగస్టు 17) జరిగింది. వివరాల్లోకెళ్తే..

నిర్మల్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జగిత్యాల నుంచి ఖానాపూర్‌కు వెళ్తోంది. బస్సులో సుమారు 170 మంది ప్రయాణికులున్నారు. బస్సు జగిత్యాల రూరల్‌ మండలం చల్‌గల్‌–మోరపల్లి శివారు చేరగానే బస్సు వెనుక కుడివైపు రెండు టైర్లు అకస్మాత్తుగా ఊడిపోయాయి. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా బస్సు కుదుపునకు గురికావడంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులయ్యారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులు బస్సు ఎక్కడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లోడ్‌ ఎక్కువ అవడంతో ఒకేసారి రెండు వెనుక టైర్లు ఊడిపోయాయి. అయితే.. అదృష్టవశాత్తు ఈ ప్రమాంలో ఎవరికేమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో బస్సును రప్పించి ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు.

సాధారణంగా ఆర్టీసీ బస్సు పరిమితి 47 మంది. అయితే శనివారం ప్రమాదానికి గురైన బస్సులో ఏకంగా 170 మంది ప్రయాణికులు ఎక్కారు. ఇప్పటికైనా బస్సుల సంఖ్యను పెంచాలని, ప్రయాణికుల అవసరానికి తగ్గట్లు బస్సులు నడపాలని ప్రజలు రేవంత్‌ సర్కార్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.