డబ్బులిచ్చి నాపై తప్పుడు ప్రచారం చేయించారు.. నాని హీరోయిన్ ఆవేదన..
Rajitha Chanti
Pic credit - Instagram
08 March 2026
సాధారణంగా సోషల్ మీడియాలో హీరోయిన్లకు సంబంధించిన ప్రతి చిన్న విషయం తెగ వైరలవుతుంది. అలాగే సెలబ్రెటీల గురించి నెగిటివ్ ప్రచారం జరుగుతుంటుంది.
ఎంతో మంది తారలు తమపై వచ్చిన రూమర్స్ పై నేరుగానే స్పందించారు. మరికొందరు మౌనంగా ఉండిపోయారు. తాజాగా ఓ హీరోయిన్ సైతం ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఆమె మరెవరో కాదు హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై నెట్టింట వచ్చిన తప్పుడు ప్రచారం పై స్పందించారు.
గత కొన్ని నెలలుగా తాను ఆన్‌లైన్‌లో ద్వేషం, దుష్ప్రచారాన్ని ఎదుర్కొంటున్నానని అన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తనకు తెలుసనని అన్నారు ప్రియాంక.
దుష్ప్రచారం అనే పదం పరిస్థితిని వివరించడానికి చాలా పెద్దది అని.. గతం గురించి పట్టించుకునే పరిస్థితుల్లో తాను ఇప్పుడు లేనని చెప్పుకొచ్చింది ఈ భామ.
సినీ రంగుల ప్రపంచంలో ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురుకావొచ్చని.. అది తనకు ఎదగడానికి మరింత ఎక్కువగా సహయపడిందని తెలిపింది ప్రియాంక .
తనపై వచ్చిన నెగిటివ్ ట్రోలింగ్ వెనుక ఎవరున్నారో అనే విషయాన్ని ప్రియాంక వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమె కామెంట్స్ వైరలవుతున్నాయి.
న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇటీవలే పవన్ సరసన ఓజీ మూవీతో మరో సూపర్ హిట్ అందుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్