19 ఏళ్లలో 13 రెట్లు పెరిగిన ప్రైజ్ మనీ.. సూర్య సేనకు ఎంతొచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
T20 Mens World Cup Final Prize Money History: క్రికెట్ క్రేజ్ పెరుగుతున్న కొద్దీ ఐసీసీ ఇచ్చే ప్రైజ్ మనీ కూడా భారీగా పెరుగుతోంది. మరి 2028 ప్రపంచకప్ నాటికి ఈ బహుమతి మొత్తం ఎంతకు చేరుతుందో చూడాలి..! ప్రస్తుతం 2026 వరకు ఎంత పెరిగిందో ఓసారి చూద్దాం..

T20 Men’s World Cup Final Prize Money History: 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో టీమిండియాకు విజేతగా రూ. 27.48 కోట్ల భారీ బహుమతి లభించింది. 2007లో ఈ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ప్రైజ్ మనీ ఏ విధంగా పెరుగుతూ వచ్చిందో ఏడాది వారీగా చూద్దాం:
| సంవత్సరం | ప్రైజ్ మనీ (₹) |
|---|---|
| 2007 | 2.02 కోట్లు |
| 2009 | 3.63 కోట్లు |
| 2010 | 4.57 కోట్లు |
| 2012 | 5.34 కోట్లు |
| 2014 | 6.71 కోట్లు |
| 2016 | 10.75 కోట్లు |
| 2021 | 12.00 కోట్లు |
| 2022 | 13.20 కోట్లు |
| 2024 | 20.42 కోట్లు |
| 2026 | 27.48 కోట్లు |
2007 – తొలి విజేత భారత్ తొలి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 5 పరుగుల తేడాతో ఓడించి భారత్ చరిత్ర సృష్టించింది. ఆ సమయంలో విజేత జట్టుకు లభించిన ప్రైజ్ మనీ సుమారు రూ. 2.02 కోట్లు.
2009 – పాకిస్థాన్ విజయం ఫైనల్లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్థాన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో విజేత జట్టుకు సుమారు రూ. 3.63 కోట్లు లభించాయి.
2010 – ఇంగ్లాండ్ బోణీ ఆస్ట్రేలియాను 7 వికెట్ల తేడాతో ఓడించి ఇంగ్లాండ్ తొలిసారి టీ20 ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయానికి గాను వారికి రూ. 4.57 కోట్లు బహుమతిగా దక్కాయి.
2012 – వెస్టిండీస్ హవా శ్రీలంకను వారి సొంత గడ్డపైనే 36 పరుగుల తేడాతో ఓడించి వెస్టిండీస్ టైటిల్ గెలిచింది. విజేత జట్టుకు రూ. 5.34 కోట్లు లభించాయి.
2014 – శ్రీలంక గెలుపు భారత్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి శ్రీలంక తొలిసారి టీ20 వరల్డ్ కప్ అందుకుంది. ఈసారి ప్రైజ్ మనీ రూ. 6.71 కోట్లకు పెరిగింది.
2016 – విండీస్ రెండోసారి ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో వెస్టిండీస్ విజయం సాధించింది. వీరికి సుమారు రూ. 10.75 కోట్లు అందజేశారు.
2021 – ఆస్ట్రేలియా తొలి టైటిల్ న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా మొదటిసారి ఛాంపియన్‌గా నిలిచింది. విజేతకు రూ. 12 కోట్లు లభించాయి.
2022 – ఇంగ్లాండ్ రెండో టైటిల్ పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఇంగ్లాండ్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈసారి ప్రైజ్ మనీ రూ. 13.20 కోట్లు.
2024 – భారత్ రెండో టైటిల్ దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. విజేత జట్టుకు సుమారు రూ. 20.42 కోట్లు లభించాయి.
2026 – భారత్ మూడోసారి విశ్వవిజేత న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించి భారత్ మూడోసారి టైటిల్ సాధించింది. ఈ విజయంతో రికార్డు స్థాయిలో రూ. 27.48 కోట్లు ప్రైజ్ మనీగా అందుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
