నన్ను పెళ్లి చేసుకోవాలంటే 100 ఎకరాలు ఉండాలి.. హీరోయిన్ కండీషన్..

Rajitha Chanti

Pic credit - Instagram

08 March 2026

ప్రస్తుతం ఆమె తెలుగులో తోపు హీరోయిన్. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. ఆమె నటించిన 3 సినిమాలు రూ.800 కోట్లు రాబట్టాయి. 

ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. తెలుగుతోపాటు తమిళం భాషలలోనూ వరుస హిట్స్ అందుకుంటూ ఇప్పుడు ఫుల్ జోష్ మీద దూసుకుపోతుంది.

ఆమె మరెవరో కాదు హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఫెమినా మిస్ ఇండియా విజేత ఈ అమ్మడు ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత హిట్ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ గోల్డెన్ బ్యూటీగా మారిపోయింది. సంక్రాంతికి వస్తున్నాం, లక్కీ భాస్కర్ హిట్ చిత్రాల్లో కనిపించింది.

అలాగే ఆమె విజయ్ దళపతి జోడిగా ది గోట్ చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్ ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ తన పెళ్లి గురించి ప్రస్తావించింది. అలాగే తనను పెళ్లి చేసుకోబోయే వాడికి కండీషన్ పెట్టింది.

నన్ను వివాహం చేసుకునే వ్యక్తికి కనీసం 100 ఎకరాల భూమి ఉండాలి. అతను వంట చేయడం, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం రావాలని చెప్పుకొచ్చింది.