150 శాతం పెరిగిన ఫ్లైట్ చార్జీలు.. ప్రయాణాలపై తీవ్ర ప్రభావం
మధ్యప్రాచ్య యుద్ధ వాతావరణం కారణంగా అమెరికా-భారత్ మధ్య నడిచే విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. కీలక మార్గాలు మూతపడటం, విమానాలను మళ్లించడంతో ప్రయాణ సమయం, ఖర్చులు పెరిగాయి. న్యూయార్క్, షికాగో నుండి ఢిల్లీ, ముంబైకి టికెట్లు 100-150% అధికమయ్యాయి, ప్రయాణికులపై తీవ్ర భారం పడుతోంది. ఈ ఘర్షణలు ప్రపంచ విమానయాన రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.
మధ్యప్రాచ్యంలో యుద్ద వాతావరణం విమానయాన రంగంపై ప్రభావం పడింది. అమెరికా, భారత్ మధ్య నడిచే ప్రధాన రూట్లలో విమాన టికెట్ ధరలు భారీగా పెరిగాయి. యుద్ధ మేఘాల కారణంగా కీలక గగనతల మార్గాలను మూసేయడంతో, వేరే రూట్ల ద్వారా మళ్లిస్తుండటం, మరికొన్ని సర్వీసులను రద్దు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. అమెరికా, యూరప్, ఆసియా ఖండాలను అనుసంధానించే ప్రధాన కేంద్రంగా మధ్యప్రాచ్యం ఉంటుంది. ఘర్షణల నేపథ్యంలో ఈ ప్రాంతం మీదుగా వెళ్లేందుకు విమానయాన సంస్థలు వెనకాడుతున్నాయి. ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం, ఒకప్పుడు విమానాలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు చాలా వరకు ఖాళీగా కనిపిస్తోంది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళుతుండటంతో ప్రయాణ సమయం, ఖర్చు పెరిగి ఆ భారం ప్రయాణికులపై పడుతోంది. గూగుల్ ఫ్లైట్స్ తాజా గణాంకాల ప్రకారం.. న్యూయార్క్, షికాగో, నెవార్క్ నగరాల నుంచి ముంబై, న్యూఢిల్లీకి వచ్చే విమాన టికెట్ల రేట్లు అమాంతం పెరిగాయి. ముఖ్యంగా న్యూయార్క్ జేఎఫ్ కే విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి టికెట్ ధరలు ప్రస్తుతం రూ. 1.34 లక్షల నుంచి రూ. 2.25 లక్షల వరకు పలుకుతున్నాయి. సాధారణ రోజుల్లో ఇవి రూ. 45 వేల నుంచి రూ. 1 లక్ష మధ్య ఉంటాయి. అంటే 100 శాతానికి పైగా ధరలు పెరిగాయి. షికాగో నుంచి వచ్చే విమానాల్లో ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది. షికాగో – ముంబై రూట్‌లో టికెట్ ధరలు ఏకంగా 150 శాతం పెరిగి, రూ. 1.9 లక్షల నుంచి రూ. 2.8 లక్షలకు చేరాయి. సాధారణంగా ఈ రూట్‌లో రూ. 45 వేల నుంచి రూ. 75 వేలకే టికెట్లు లభిస్తాయి. అలాగే నెవార్క్ – ముంబై, షికాగో – ఢిల్లీ రూట్లలో కూడా టికెట్ ధరలు రెట్టింపు అవ్వడంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరులో ‘గూగుల్’ టెకీ ఖర్చు నెలకు రూ.1.43 లక్షలా !! ఇలా అయితే బ్రతకడం ఎలా
అబ్బా.. మనోళ్లు పంపే డబ్బుపై యుద్ధం దెబ్బ..
వీధిలో నడుస్తున్నపెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు
Egg Price: పౌల్ట్రీకి యుద్ధ గండం.. రూ.3 కి పడిన గుడ్డు ధర
Sara Tendulkar: అర్జున్ పెళ్లిలో మెరిసిన సారా: ఆ నెక్లెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ
ఆదర్శ సర్పంచ్.. పదవి 'పక్కనపెట్టి'.. చెత్త ట్రాక్టర్ పట్టి !!
ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ
ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బయటికొచ్చిన పాములు
ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే
ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. సేంద్రియ పెళ్లి గురించి మీకు తెలుసా
వానరాలకు 'త్రిశూలం' టాటూ.. అసలు కారణం ఇదే

