బెంగళూరులో ‘గూగుల్’ టెకీ ఖర్చు నెలకు రూ.1.43 లక్షలా !! ఇలా అయితే బ్రతకడం ఎలా
బెంగళూరులోని గూగుల్‌లో పనిచేస్తున్న పూజ నరుల నెలవారీ ఖర్చులు రూ.1.43 లక్షలుగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంటి అద్దె, ఫ్లైట్ టికెట్లు, బహుమతులతో కూడిన ఈ లెక్క సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల అధిక జీతాలకు అనుగుణంగా జీవన వ్యయం కూడా అంతే ఎక్కువగా ఉంటుందని ఇది స్పష్టం చేసింది. నెటిజన్లు దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల జీతాలు ఎంత ఎక్కువ ఉంటాయో.. వారి ఖర్చులు కూడా అదే రేంజ్‌లో ఉంటాయని సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ద్వారా తెలియడంతో ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. గూగుల్‌లో పనిచేస్తున్న పూజా నరుల అనే 24 ఏళ్ల టెక్కీ ఫిబ్రవరి నెలకు సంబంధించి తన ఖర్చుల చిట్టాను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. పూజ షేర్ చేసిన వివరాల ప్రకారం.. గత నెలలో ఆమె చేసిన మొత్తం ఖర్చు అక్షరాలా రూ.1.43 లక్షలు. ఇందులో గది అద్దె రూ.22,400, పనిమనిషికి, వంట సరుకులకు రూ.2,800 చొప్పున, విద్యుత్, ఇతర బిల్లులకు ఆమె రూ.2,000 ఖర్చు చేస్తుంది. వీకెండ్ ఎంజాయ్‌మెంట్ కోసం వారానికి రూ.2 వేల చొప్పున నెలకు రూ.8,000, ఇంటికి వెళ్లడానికి ఫ్లైట్ టికెట్లు రూ.16,000, స్నేహితుల కోసం తీసుకెళ్లిన గిఫ్ట్ ల ఖరీదు రూ.20,000 అని పూజ తెలిపారు. అయితే ప్రతి నెలా ఇంత ఖర్చు కాదని, ఫిబ్రవరిలో కొన్ని అదనపు ఖర్చులు కలిసాయని ఆమె క్లారిటీ ఇచ్చారు. కొత్త ఇంటికి మారడం వల్ల మూవర్స్ అండ్ ప్యాకర్స్‌కు రూ.3,000, ఇంటి సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.66,600 చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. ఇవన్నీ కలిపి మొత్తం రూ.1.43 లక్షలకు చేరిందని ఆమె వివరించారు. ‘‘మొత్తం ఖర్చు లెక్కించిన తనకు మైండ్ బ్లాక్ అయ్యిందనీ మళ్లీ ఇలాంటి లెక్కలు ఎప్పుడూ వేయకూడదని నిర్ణయించుకున్నాను అంటూ ఆమె తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. బెంగళూరులో అన్నీ ఖరీదైనవేనని, తర్వాతి నెలలో ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ఒక మద్యతరగతి వ్యక్తి ఏడాది ఆదాయం, బెంగళూరు టెక్కీకి ఒక్క నెల ఖర్చులకు సమానమా?’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అబ్బా.. మనోళ్లు పంపే డబ్బుపై యుద్ధం దెబ్బ..
వీధిలో నడుస్తున్నపెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు
Egg Price: పౌల్ట్రీకి యుద్ధ గండం.. రూ.3 కి పడిన గుడ్డు ధర
Sara Tendulkar: అర్జున్ పెళ్లిలో మెరిసిన సారా: ఆ నెక్లెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
కోడిగుడ్ల నుంచి కిచిడీ దాకా.. కాకతీయ వర్సిటీలో ఆగని మెస్ గోల
బెంగళూరులో ‘గూగుల్’ టెకీ ఖర్చు నెలకు రూ.1.43 లక్షలా
వీధిలో నడుస్తున్న పెద్ద పులి.. చివరికి..
పొలంలో త్రిశూలాలు.. ఆశ్చర్యపోయిన జనం..
ఇదేం విడ్డూరం స్వామీ.. ఆటోలకు బేడీలా
స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్
గ్రామ సర్పంచ్లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం

