కోడిగుడ్ల నుంచి కిచిడీ దాకా.. కాకతీయ వర్సిటీలో ఆగని మెస్ గోల
కాకతీయ విశ్వవిద్యాలయం విద్యా చర్చలకు బదులు 'మెస్' వివాదాలకు కేంద్రంగా మారింది. హాస్టల్ భోజన నాణ్యత, మెనూ మార్పులపై విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కోడిగుడ్లు, చికెన్, చపాతీల విషయంలో తలెత్తిన ఘర్షణలు యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చాయి. ఈ 'మెనూ పాలిటిక్స్'తో వర్సిటీ భవిష్యత్ పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కాకతీయ విశ్వవిద్యాలయం ఇప్పుడు విద్యా చర్చలకు బదులు ‘మెస్’ పంచాయితీలకు వేదికైంది. గత పదిహేను రోజులుగా ఇక్కడ జరుగుతున్న వరుస ఘటనలు యూనివర్సిటీ ప్రతిష్టను రోడ్డున పడేస్తున్నాయి. మెరుగైన వసతులు లేదా కొత్త కోర్సుల కోసం కాకుండా, కేవలం మెనూలో మార్పుల కోసం విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి.హాస్టల్ మెస్‌లో నాణ్యమైన భోజనం అందించడంలో అధికారులు విఫలమవుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, చిన్న చిన్న కారణాలకే తరచుగా రోడ్డెక్కటమేంటని అధికారులు వాపోతున్నారు. వారం రోజుల క్రితం మెస్‌లో కోడిగుడ్ల విషయంలో మొదలైన చిన్న వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఆ మరుసటి రోజే చికెన్ వడ్డనలో ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ వేశారంటూ విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురి తలలు పగిలిపోగా, ఆరుగురు విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం ఉదయం మెనూ ప్రకారం చపాతీలు పెట్టకుండా కిచిడీ పెట్టారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా కిచిడీ వండిన భారీ వంట పాత్రలను మెస్ నుంచి ఈడ్చుకుంటూ వచ్చి యూనివర్సిటీ మెయిన్ గేటు ముందు పెట్టి నిరసన తెలిపారు. దీనివల్ల మిగతా విద్యార్థులకు సకాలంలో టిఫిన్ అందక ఇబ్బంది పడ్డారు. విద్యార్థుల వెర్షన్ ప్రకారం.. మెస్ అధికారులు విద్యార్థుల సొమ్మును వెనకేసుకుంటూ, సరైన పౌష్టికాహారం అందించడం లేదు. ప్రశ్నించిన వారికే ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వారి పొట్ట కొడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే, చిన్న చిన్న కారణాలకే వంట పాత్రలను రోడ్డుపైకి తీసుకురావడం, వర్సిటీ పరువు తీయడంపై అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, రిజిస్ట్రార్ జోక్యంతో ప్రస్తుతానికి ఆందోళన సద్దుమణిగినా, కేయూలో ఈ ‘మెనూ పాలిటిక్స్’ ఎటు దారితీస్తాయోనని అందరూ చర్చించుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gaddar Awards 2025: గద్దర్ అవార్డుల సందడి: మెగాస్టార్‌కు ‘ఎన్టీఆర్’ పురస్కారం..
Viral Video: పొలంలో త్రిశూలాలు.. ఆశ్చర్యపోయిన జనం..
పెళ్లికి 13 రోజుల ముందు విషాదం..
ఇరాన్ యుద్ధంతో చుక్కల్లో విమాన చార్జీలు.. అమెరికా ప్రయాణం భారమే
వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ
ఆదర్శ సర్పంచ్.. పదవి 'పక్కనపెట్టి'.. చెత్త ట్రాక్టర్ పట్టి !!
ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ
ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బయటికొచ్చిన పాములు
ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే
ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. సేంద్రియ పెళ్లి గురించి మీకు తెలుసా
వానరాలకు 'త్రిశూలం' టాటూ.. అసలు కారణం ఇదే

