AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లికి 13 రోజుల ముందు విషాదం..

పెళ్లికి 13 రోజుల ముందు విషాదం..

Phani CH
|

Updated on: Mar 08, 2026 | 5:33 PM

Share

తేజ్‌పూర్ సమీపంలో సుఖోయ్ యుద్ధ విమానం కూలిన ఘటనలో ఫ్లైట్ లెఫ్టినెంట్ అనుజ్ వశిష్ట్ వీరమరణం పొందారు. పెళ్లికి కేవలం 13 రోజుల ముందు జరిగిన ఈ దుర్ఘటనతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సాంకేతిక లోపంతో విమానం కూలిపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై భారత వైమానిక దళం ఉన్నత స్థాయి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది.

అస్సాంలోని తేజ్‌పూర్ సమీపంలో సుఖోయ్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటనలో ఫ్లైట్ లెఫ్టినెంట్ అనుజ్ వశిష్ట్ వీరమరణం పొందారు. మరో 13 రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఆయన మరణించడంతో కుటుంబంలో, ఆయన స్వస్థలంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తేజ్‌పూర్ ఎయిర్‌బేస్ నుంచి సాధారణ శిక్షణ కోసం బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన అనుజ్ విమానం నుంచి ఎజెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించినా సమయం సరిపోకపోవడంతో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విమాన శకలాలను అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై భారత వైమానిక దళం ఉన్నత స్థాయి దర్యాప్తు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది. హర్యానాలోని శ్రీరాంనగర్‌కు చెందిన అనుజ్ వివాహం మార్చి 20న జరగాల్సి ఉంది. పెళ్లి వేడుకలతో కళకళలాడాల్సిన ఆయన ఇంట్లో ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది. తన కొడుకును పెళ్లి బట్టల్లో చూడాలనుకున్నాను కానీ త్రివర్ణ పతాకంలో చుట్టిన పెట్టెలో చూస్తున్నానంటూ ఆయన తండ్రి పవన్ వశిష్ట్ రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. చిన్నప్పటి నుంచే పైలట్ కావాలన్న లక్ష్యంతో ఎదిగిన అనుజ్ మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు. ఆయన పార్థివదేహాన్ని స్వగ్రామానికి తరలించి, పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇరాన్ యుద్ధంతో చుక్కల్లో విమాన చార్జీలు.. అమెరికా ప్రయాణం భారమే

ఇదేం విడ్డూరం స్వామీ.. ఆటోలకు బేడీలా

Telangana: తెలంగాణపై భానుడి ఉగ్రరూపం.. 6 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

LPG Cylinder: భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు

Tollywood: మాస్ జాతర చూపించబోతున్న హీరోలు

Follow Us