LPG Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా దేశీయంగా LPG వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెంచారు. ఇది వినియోగదారులకు భారంగా మారినప్పటికీ, 'ఉజ్వల యోజన' లబ్ధిదారులకు రూ.300 సబ్సిడీ యథాతథంగా కొనసాగుతుంది.
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశీయ వంటగ్యాస్ వినియోగదారులపై పడింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఇంధన దిగుమతి వ్యయం పెరగడంతో, చమురు కంపెనీలు ఎల్‌పిజి ధరలను భారీగా పెంచాయి. మార్చి 7, శనివారం నుండి దేశవ్యాప్తంగా పెరిగిన కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 14.2 కిలోల గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 60 పెరిగింది. గత ఏడాది ఏప్రిల్‌లో రూ.50 పెరిగిన తర్వాత, ఏడాది కాలంలో ఇది రెండో పెంపు.పెరిగిన ధరలతో వివిధ నగరాల్లో గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.913లకు చేరింది. ముంబైలో రూ.912.50కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో రూ.928.50 గా కొనసాగుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరకూడా భారీగా పెరిగింది. కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో ఈ ధర రూ. 1,883కు చేరుకోగా, ముంబైలో రూ. 1,835కి పెరిగింది. ఇప్పటికే మార్చి 1న రూ. 28 పెరగగా, వారం తిరగకముందే మళ్ళీ పెరగడం వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. ధరలు పెరిగినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ‘ఉజ్వల యోజన’ లబ్ధిదారులకు ఉపశమనం కలిగించింది. సుమారు 10 కోట్లకు పైగా కుటుంబాలకు ఏడాదికి 12 రీఫిల్‌ల వరకు అందించే రూ. 300 సబ్సిడీ యథాతథంగా కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tollywood: మాస్ జాతర చూపించబోతున్న హీరోలు
Sankranthi Movies: సంక్రాంతికి క్లిక్ అవుతున్న ఫ్యామిలీ స్టోరీలు
సీనియర్ హీరోల చిత్రాల్లో.. క్రేజీ బ్యూటీస్..
Dhurandhar 2 Trailer: ‘ధురంధర్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. బాక్స్ ఆఫీస్ అంచనాలు, భారీ హైప్ పెంచేసిందా
వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ
ఆదర్శ సర్పంచ్.. పదవి 'పక్కనపెట్టి'.. చెత్త ట్రాక్టర్ పట్టి !!
ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ
ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బయటికొచ్చిన పాములు
ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే
ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. సేంద్రియ పెళ్లి గురించి మీకు తెలుసా
వానరాలకు 'త్రిశూలం' టాటూ.. అసలు కారణం ఇదే

