AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బా.. మనోళ్లు పంపే డబ్బుపై యుద్ధం దెబ్బ..

అబ్బా.. మనోళ్లు పంపే డబ్బుపై యుద్ధం దెబ్బ..

Phani CH
|

Updated on: Mar 08, 2026 | 6:27 PM

Share

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధ ప్రభావం చమురు దిగుమతులు, విమానయానంపైనే కాదు.. గల్ఫ్‌ దేశాల నుంచి మనవాళ్లు ఇక్కడ ఉన్న తమవారికి పంపే డబ్బు ల పైనా తీవ్ర ప్రభావం పడనుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రపంచంలో అత్యధికంగా రెమిటెన్సెస్‌ అందుకునే దేశాల్లో అగ్ర స్థానంలో భారత్‌ ఉంది. అలా వచ్చే సొమ్ము మన దేశ జీడీపీలో 3.5 శాతమని అంచనా.

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధ ప్రభావం చమురు దిగుమతులు, విమానయానంపైనే కాదు.. గల్ఫ్‌ దేశాల నుంచి మనవాళ్లు ఇక్కడ ఉన్న తమవారికి పంపే డబ్బు ల పైనా తీవ్ర ప్రభావం పడనుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రపంచంలో అత్యధికంగా రెమిటెన్సెస్‌ అందుకునే దేశాల్లో అగ్ర స్థానంలో భారత్‌ ఉంది. అలా వచ్చే సొమ్ము మన దేశ జీడీపీలో 3.5 శాతమని అంచనా. అమెరికాకు మనం చేసే ఎగుమతుల విలువ మన ఆర్థిక వ్యవస్థలో కేవలం 2 శాతమే. అంటే.. అమెరికాకు మనం అమ్మే వస్తువుల కంటే.. ప్రపంచం నలుమూలలా ఉన్న మనవాళ్లు అక్కడ సంపాదించి ఇక్కడికి పంపే మొత్తమే ఎక్కువ! సౌదీ అరేబియా, కువైత్‌, ఖతార్‌, ఒమన్‌ దేశాల్లో 90 లక్షల మంది కంటే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. వారు ఇక్కడ ఉన్న తమవారికి పంపే సొమ్ము.. మన దేశ కరెంటు ఖాతా లోటును అంటే ఎగుమతి చేసే వస్తువుల కన్నా దిగుమతయ్యే వస్తువులు ఎక్కువ కావడం దీంతో ఏర్పడే ఆర్థిక లోటును పూడ్చడంలో, మన విదేశీ మారక నిల్వలను స్థిరంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తోంది. భారతదేశానికి ఇలా ఏటా వచ్చే మొత్తం నిధుల్లో గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే సొమ్మే 38 శాతం దాకా ఉంటుందని ‘సిటీ’ గ్రూప్‌ తెలిపింది. అంతేనా.. గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారత్‌కు వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే.. రెమిటెన్స్‌లే ఎక్కువ. మనకు ఇలా వచ్చే నిధుల్లో అత్యధిక భాగం అమెరికా నుంచి వస్తోంది. యూఏఈ తర్వాతి స్థానంలో ఉంది. 2025లో మన దేశానికి ఇలా వివిధ దేశాల నుంచి మనవాళ్లు పంపిన మొత్తం సొమ్ము దాదాపు రూ.12.4 లక్షల కోట్లు. అందులో గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన సొమ్మే రూ.4.71 లక్షల కోట్లు. గల్ఫ్‌ దేశాల్లో భారతీయులు ఎక్కువగా.. చమురు, సేవలు, నిర్మాణ, ఆతిథ్య, రిటైల్‌, పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీధిలో నడుస్తున్నపెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు

Egg Price: పౌల్ట్రీకి యుద్ధ గండం.. రూ.3 కి పడిన గుడ్డు ధర

Sara Tendulkar: అర్జున్ పెళ్లిలో మెరిసిన సారా: ఆ నెక్లెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

కోడిగుడ్ల నుంచి కిచిడీ దాకా.. కాకతీయ వర్సిటీలో ఆగని మెస్ గోల

Gaddar Awards 2025: గద్దర్ అవార్డుల సందడి: మెగాస్టార్‌కు ‘ఎన్టీఆర్’ పురస్కారం..

Follow Us