వీధిలో నడుస్తున్నపెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు
మెక్సికోలోని ఓ జనావాసంలో పెద్ద పులి ప్రవేశించి స్థానికులను షాక్‌కు గురిచేసింది. మొదట రోడ్డుపై నడుస్తూ, తర్వాత చెట్టు కింద పడుకున్న పులిని ఓ వ్యక్తి బెల్టుతో పెంపుడు కుక్కలా లాక్కెళ్లాడు. అటవీ జంతువు మనిషి వెనక నడిచిన ఈ విచిత్ర ఘటన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పెంపుడు పులిపై జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు స్పందిస్తున్నారు.
అడవుల్లో ఉండాల్సిన పులులు, సింహాలు.. అప్పుడప్పుడూ జనావాసాల్లోకి వస్తుంటాయి. కొన్నిసార్లు జంతువులపై దాడి చేసి వెళ్తే.. మరికొన్నిసార్లు ఏకంగా మనుషులపై కూడా దాడి చేస్తుంటాయి. అయితే కొన్ని సార్లు ఎవరూ ఊహించని విధంగా విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పెద్ద పులి ఇళ్ల మధ్యలోకి వచ్చేసింది. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మెక్సికోలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ పెద్ద పులి ఇళ్ల ముందు రోడ్డుపై తాపీగా నడుస్తూ వెళ్తోంది. ఇళ్ల ముందుకు పులి రావడాన్ని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు దానికి దూరంగా పరుగెత్తారు. మరికొందరు దూరంగా నిలబడి.. ఈ దృశ్యాలను తమ ఫోన్లతో వీడియోలు తీసుకున్నారు. అయితే మనుషులను చూసినా కూడా ఆ పులి ఏమీ చేయకుండా తన దారిన తాను నడుస్తూ వెళ్తోంది. కొంత దూరం వెళ్లిన తర్వాత.. రోడ్డు పక్కన చెట్టు కింద పడుకుంది. పులి ప్రవర్తన చూసి అక్కడున్న వారు షాక్ అయ్యే లోపు.. అంతా అవాక్కయ్యే ఘటన జరిగింది. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి చేతిలో బెల్ట్‌తో అక్కడికి వచ్చాడు. పులి వద్దకు రాగానే.. తన చేతిలోని బెల్ట్‌ను దాని మెడకు తగిలించి లాక్కెళ్లాడు. పులి కూడా అతడిపై దాడి చేయాల్సింది పోయి.. వెనుకే పెంపుడు కుక్కలా నడుచుకుంటూ వెళ్లింది. ఈ సీన్ చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. చూస్తుంటే ఆ వ్యక్తి పులిని పెంచుకుంటున్నాడేమో అనిపిస్తుంది. వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ‘ఎంత పెంపుడు పులి అయినా..దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ కొందరు, ‘పెంపుడు కుక్కలా మారిపోయిందిగా’.. అంటూ మరికొందరు, రకరకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేసారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Egg Price: పౌల్ట్రీకి యుద్ధ గండం.. రూ.3 కి పడిన గుడ్డు ధర
Sara Tendulkar: అర్జున్ పెళ్లిలో మెరిసిన సారా: ఆ నెక్లెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
కోడిగుడ్ల నుంచి కిచిడీ దాకా.. కాకతీయ వర్సిటీలో ఆగని మెస్ గోల
Gaddar Awards 2025: గద్దర్ అవార్డుల సందడి: మెగాస్టార్‌కు ‘ఎన్టీఆర్’ పురస్కారం..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

