Egg Price: పౌల్ట్రీకి యుద్ధ గండం.. రూ.3 కి పడిన గుడ్డు ధర
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గల్ఫ్ దేశాలకు కోడిగుడ్ల ఎగుమతులు పూర్తిగా ఆగిపోవడంతో ధరలు దారుణంగా పడిపోయాయి. రోజుకు కోట్లాది గుడ్లు నిల్వ ఉండిపోవడంతో, రైతులు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకే అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ సంక్షోభం పౌల్ట్రీ పరిశ్రమకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని రవాణా మార్గాలను సురక్షితం చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ జ్వాలలు తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ రైతుల పొట్ట కొడుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో, కోడిగుడ్డు ధర దారుణంగా పడిపోయింది. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ రోజుకు కోట్లాది రూపాయల నష్టాలను చవిచూస్తోంది. మన దేశం నుంచి ఎగుమతయ్యే కోడిగుడ్లలో సింహభాగం గల్ఫ్ దేశాలకే వెళతాయి. అయితే.. ఇరాన్ యుద్ధం కారణంగా అక్కడి పోర్టులు, విమానాశ్రయాలు మూతపడటంతో ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ సుమారు 3 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో కోటి గుడ్లు స్థానికంగా వినియోగిస్తుండగా, మిగిలిన 1.60 కోట్ల గుడ్లు ఎగుమతి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఎగుమతులు లేక స్టోరేజి యార్డులు, ప్యాకింగ్ కేంద్రాల్లోనే కోట్లాది గుడ్లు పేరుకుపోతున్నాయి. దేశీయ మార్కెట్లోకి నిల్వలు భారీగా వచ్చి చేరుతుండటంతో ధరలు కుప్పకూలాయి. గత నెలలో ఒక్కో గుడ్డు ధర రూ. 7 నుండి రూ. 9 వరకు పలికేది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ కోడిగుడ్డు ధరను తగ్గిస్తూ రూ. 4.30గా నిర్ణయించినా, నిల్వలు ఎక్కువవడంతో రైతులు రూ. 3.50కే విక్రయించాల్సి వస్తోంది. ఇది ఉత్పత్తి వ్యయం కంటే చాలా తక్కువ. హైదరాబాద్‌లో ప్రస్తుతం వంద కోడిగుడ్ల ధర రూ. 420 – రూ. 450 లు పలుకుతోంది. విజయవాడలో రూ. 425 నుంచి 430 రూపాయలు పలుకుతుంటే విశాఖపట్నంలో రూ.420 నుంచి రూ.500 లు పలుకుతోంది. తమిళనాడులోని నమక్కల్ మార్కెట్ తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలే ఈ ప్రభావానికి గురయ్యాయి. రోజుకు సుమారు రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లుతుండటంతో పౌల్ట్రీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణాకు సురక్షిత మార్గాలను ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sara Tendulkar: అర్జున్ పెళ్లిలో మెరిసిన సారా: ఆ నెక్లెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
కోడిగుడ్ల నుంచి కిచిడీ దాకా.. కాకతీయ వర్సిటీలో ఆగని మెస్ గోల
Gaddar Awards 2025: గద్దర్ అవార్డుల సందడి: మెగాస్టార్‌కు ‘ఎన్టీఆర్’ పురస్కారం..
వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ
ఆదర్శ సర్పంచ్.. పదవి 'పక్కనపెట్టి'.. చెత్త ట్రాక్టర్ పట్టి !!
ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ
ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బయటికొచ్చిన పాములు
ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే
ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. సేంద్రియ పెళ్లి గురించి మీకు తెలుసా
వానరాలకు 'త్రిశూలం' టాటూ.. అసలు కారణం ఇదే

