AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Insurance: జస్ట్‌ ఏడాదికి రూ.1000 చెల్లిస్తే చాలు రూ.20 లక్షల ఇన్సూరెన్స్‌.. ఎస్‌బీఐలో అదిరిపోయే స్కీమ్‌!

SBI Insurance Scheme: ఎస్బీఐలో అద్భుతమైన ప్రమాద బీమా ఉంది. దీనిని ఎస్బీఐ యోనో యాప్‌లో లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌, మీ సమీపంలో ఉండే ఎస్బీఐ బ్రాంచిలో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం దరఖాస్తు దారునికి ఆ బ్రాంచిలో సేవింగ్స్​​ లేదా కరెంట్​ ఖాతా ఉండటం..

SBI Insurance: జస్ట్‌ ఏడాదికి రూ.1000 చెల్లిస్తే చాలు రూ.20 లక్షల ఇన్సూరెన్స్‌.. ఎస్‌బీఐలో అదిరిపోయే స్కీమ్‌!
Sbi Insurance
Subhash Goud
|

Updated on: Mar 09, 2026 | 9:34 AM

Share

SBI Insurance Scheme: ఈ రోజుల్లో ఎంత సంపాదిస్తున్నామనేది కాదు. ఎంత పొదుపు చేశామనేది చాలా ముఖ్యం. ఇప్పుడు రోజుల్లో మనిషి ఎంత కాలం జీవిస్తారో తెలియని పరిస్థితి ఉంది. కుటుంబ పెద్ద దిక్కు చనిపోతే కుటుంబ సభ్యులు రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. అందుకే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలని పదేపదే చెబుతుంటారు నిపుణులు. ఇన్సూరెన్స్‌ వల్ల భవిష్యత్తులో కుటుంబం రోడ్డున పడకుండా ఆసరాగా నిలుస్తుంది. ఇన్సూరెన్స్‌ అంటే ఏడాదికి వేలల్లో చెల్లించాల్సిన అవసరం లేని కొన్ని ప్రభుత్వ స్కీమ్‌లు కూడా ఉన్నాయి. కానీ వాటి గురించి జనాల్లో పెద్దగా అవగాహన లేని కారణంగా ప్రాచూర్యం పొందలేకపోతున్నాయి. ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయి. బయటకు వెళ్లామంటే చాలు ఇంటికి తిరిగి వస్తామా? లేదా అన్నది తెలియని పరిస్థితి ఉంది. రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. అలాంటి వారి కోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)లో అద్భుతమైన స్కీమ్‌ ఉంది. అదే యాక్సిడెంటల్‌ ఇన్సూరెన్స్‌.

ఎస్బీఐ ప్రమాద బీమా:

ఇంటి బాధ్యతలు నిర్వహించి, కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చే వ్యక్తి అనుకోని ప్రమాదంలో మరణిస్తే సంబంధిత కుటుంబానికి జరిగే నష్టం పూడ్చలేనిది. పేద కుటుంబాలైతే రోడ్డున పడే పరిస్థితి నెలకొంటుంది. అలాంటి సందర్భాల్లో ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంగా ఎస్బీఐ వ్యక్తిగత, ప్రమాద బీమా పథకాన్ని తీసుకువచ్చింది. ఏడాదికి కేవలం రూ.1000 మాత్రమే చెల్లించి ఏకంగా రూ.20 లక్షల వరకు బీమాను పొందవచ్చు. ఇంకా ఎక్కువ చెల్లిస్తే రెట్టింపు బీమాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతి సామాన్యుడికి వెయ్యి రూపాయలు అనేది పెద్ద మొత్తం కాదు. సులభంగా చెల్లించి బీమాను పొందవచ్చు. ఈ లెక్కన నెలకు రూ.90 రూపాయలలోపే పడుతుంది.

ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Meesho: మీషోకు భారీ ఎదురుదెబ్బ.. యాప్‌లో ఈ విషయం దాచినందుకు రూ.1,500 కోట్ల నోటీసు!

ఈ 1000 రూపాయలను సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల వల్ల మరణం సంభవించొచ్చు లేదా వైకల్యం ఏర్పడవచ్చు. ఈ బీమాను ఎస్‌బీఐలో సులభంగా తీసుకోవచ్చు. లేదా యోనో యాప్‌ ద్వారా కూడా సులభంగానే పొందవచ్చు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

దీనికోసం ఎస్బీఐ యోనో యాప్‌లో లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌, మీ సమీపంలో ఉండే ఎస్బీఐ బ్రాంచిలో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం దరఖాస్తు దారునికి ఆ బ్రాంచిలో సేవింగ్స్​​ లేదా కరెంట్​ ఖాతా ఉండటం ముఖ్యం. తర్వాత నామినీ వివరాలను బ్యాంకులో సమర్పించాలి. దీనిని ఒక సంవత్సరానికి ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా ప్రతి సంవత్సరానికి రెన్యువల్​ చేసుకోవచ్చు.

క్లెయిమ్‌ ఎలా చేసుకోవాలి?

క్లెయిమ్‌ చేసుకోవడం కూడా సులభమే. దీనికోసం నామినీ బ్యాంకు బ్రాంచిని సంప్రదించాలి. ఖాతాదారు చనిపోయినా, ఆసుపత్రిపాలైనా సంబంధిత ధృవీకరణ పత్రాన్ని తీసుకురావాలి. దీనితో పాటు నామినీ ఆధార్, పాన్​ కార్డులు తీసుకొస్తే సరిపోతుంది. క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Meesho: మీషోకు భారీ ఎదురుదెబ్బ.. యాప్‌లో ఈ విషయం దాచినందుకు రూ.1,500 కోట్ల నోటీసు!

మరిన్ని ప్రయోజనాలు:

ఈ బీమా వల్ల మరిన్ని ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ప్రమాదం వల్ల బీమా తీసుకున్న వ్యక్తి మరణించినట్లయితే లేదా శాశ్వత వైకల్యానికి గురైనా కుటుంబానికి ఈ పాలసీ అండగా నిలుస్తోందని చెప్పాలి. మరణించిన వెంటనే బ్యాంకుకు తెలియజేస్తే రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ మొత్తం ఇల్లు లేదా వాహన యాజమాన్యం హక్కులను కుటుంబ సభ్యుల పేరిట మార్పించేందుకు ఉపయోగపడతాయి. అలాగే కుటుంబంలోని ఇద్దరు పిల్లల చుదువు కోసం రూ.20 వేలు అందిస్తుంది. అలాగే అంబులెన్సు ఖర్చుల కోసం రూ.1,500 పొందవచ్చు. మృతి చెందితే అంత్యక్రియల ఖర్చులకు రూ.10 వేల వరకు అందిస్తుంది బ్యాంకు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us