అనకాపల్లి జిల్లా, గోలుగొండ మండలం, ఏ.ఎల్. పురం జడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థిని దుర్గాలక్ష్మి తరగతి గదిలో ఆత్మహత్య చేసుకుంది. స్కూల్ సమయం ముగిసినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతకగా, ఆమె మృతదేహం ఉరికి వేలాడుతూ కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.