పట్టు చీరలో పుత్తడి బొమ్మలా..అనసూయ బ్యూటిపుల్ ఫొటోస్

Samatha

08 march 2026

అందాల ముద్దుగుమ్మ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

అనసూయ

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు అభిమానులకు పరిచయమైన ముద్దుగుమ్మ యాంకర్ అనసూయ. ఈ అమ్మడు జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుంది.

జబర్దస్త్ కామెడీ షో

జబర్దస్త్‌లో యాంకర్‌గా చేస్తూ, మధ్య మధ్యలో పంచ్‌లు వేయండం, తన డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. దీని తర్వాత ఈ బ్యూటీ సొగ్గాడే చిన్నినాయనతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది

యాంకర్

నాగార్జున సరన , చిన్న పాత్రలో మెరిచింది. ఈ మూవీలో ఈ బ్యూటీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో రంగస్థలం సినిమాలో కీలక పాత్రలో ఛాన్స్ కొట్టేసింది.

రంగస్థలం

ఈ మూవీలో రంగమ్మత్త పాత్రలో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ బ్యూటీ లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి.

రంగమ్మత్త

దీంతో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

సినిమాలు

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా పట్టుచీరలో క్యూట్ లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

బ్యూటిఫుల్ ఫొటోస్