AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: AI వాడి డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా? GenZ కిడ్స్‌కి పండగే!

వేగంగా మారుతున్న టెక్నాలజీ యుగంలో AI కంటెంట్ సర్వీసెస్ వ్యాపారానికి భారీ డిమాండ్ పెరుగుతోంది. తక్కువ పెట్టుబడితో (రూ. 20-30 వేలు) ఈ వ్యాపారాన్ని యువత ప్రారంభించవచ్చు. ఆర్టికల్స్, సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ స్క్రిప్టుల వంటి డిజిటల్ కంటెంట్‌ను AI టూల్స్‌తో సృష్టించి చిన్న వ్యాపారాలకు, క్రియేటర్లకు అందించడం ద్వారా నెలకు రూ. 40,000-80,000 వరకు సంపాదించవచ్చు.

Business Idea: AI వాడి డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా? GenZ కిడ్స్‌కి పండగే!
Loan India
SN Pasha
|

Updated on: Mar 09, 2026 | 8:00 AM

Share

టెక్నాలజీ వేగంగా మారుతున్న ఈ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సేవలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే AI కంటెంట్ సర్వీసెస్ బిజినెస్ యువతకు మంచి అవకాశంగా మారుతోంది. సోషల్ మీడియా, యూట్యూబ్, డిజిటల్ మార్కెటింగ్ పెరుగుతున్న నేపథ్యంలో చిన్న వ్యాపారాలు, యూట్యూబ్ ఛానెల్లు, ఆన్‌లైన్ స్టార్టప్‌లు తమకు అవసరమైన కంటెంట్ కోసం AI ఆధారిత సేవలను కోరుతున్నాయి.

ఈ వ్యాపారంలో ప్రధానంగా ఆర్టికల్స్, సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ స్క్రిప్టులు, లోగోలు, పోస్టర్లు, వీడియో స్క్రిప్టులు వంటి డిజిటల్ కంటెంట్‌ను AI టూల్స్ సహాయంతో తయారుచేసి క్లయింట్లకు అందిస్తారు. ప్రస్తుతం చాలా చిన్న వ్యాపారాలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం రెగ్యులర్ కంటెంట్ అవసరం పడుతోంది. కానీ పెద్ద డిజిటల్ ఏజెన్సీలకు వెళ్లేంత బడ్జెట్ లేకపోవడంతో చిన్న AI సేవల ప్రొవైడర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ బిజినెస్ ప్రారంభించడానికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. ఒక ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్, కొన్ని AI టూల్స్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే సరిపోతుంది. మొత్తం పెట్టుబడి సుమారు రూ.20,000 నుంచి రూ.30,000 మధ్య ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మొదటగా స్థానిక వ్యాపారాలు, యూట్యూబ్ క్రియేటర్లు, ఇన్‌స్టాగ్రామ్ పేజీలు, చిన్న కంపెనీలను లక్ష్యంగా చేసుకుని సేవలను అందించవచ్చు.

ఆదాయం విషయానికి వస్తే ఒక ఆర్టికల్‌కు రూ.300 నుంచి రూ.1,000, సోషల్ మీడియా పోస్టుల ప్యాకేజీకి రూ.2,000 నుంచి రూ.5,000, యూట్యూబ్ స్క్రిప్ట్‌కు రూ.1,500 నుంచి రూ.3,000 వరకు తీసుకునే అవకాశం ఉంది. నెలకు 15–20 క్లయింట్లు ఉంటే రూ.40,000 నుంచి రూ.80,000 వరకు ఆదాయం పొందవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ వ్యాపారాన్ని ఇంటి నుంచే ప్రారంభించవచ్చు. డిజిటల్ మార్కెటింగ్, AI టూల్స్ వినియోగంపై కొంత అవగాహన ఉంటే ఈ రంగంలో త్వరగా ఎదగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి, AI ఆధారిత కంటెంట్ సేవలు తక్కువ పెట్టుబడితో ప్రారంభించి మంచి ఆదాయం పొందే ఆధునిక వ్యాపారంగా నిలుస్తున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us