AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy Vijay: విజయ్ ఇలా చేస్తావనుకోలేదు.. ఇది కరెక్ట్ కాదు.. హీరోయిన్ ఆగ్రహం

తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి పర్సనల్ లైఫ్ వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇన్నాళ్లు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు వ్యక్తిగత జీవితంతో వార్తలలో నిలుస్తున్నారు. సొంతంగా టీవీకే పార్టీ ప్రారంభించి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సమయంలోనే ఆయన వివాహ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది

Thalapathy Vijay: విజయ్ ఇలా చేస్తావనుకోలేదు.. ఇది కరెక్ట్ కాదు.. హీరోయిన్ ఆగ్రహం
Vijay
Rajeev Rayala
|

Updated on: Mar 09, 2026 | 8:37 AM

Share

ప్రస్తుతం దళపతి విజయ్ పేరు అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో తెగ వైరల్ అవుతుంది. ఇటీవలే సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అనౌన్స్ చేశారు. దాంతో విజయ్ అభిమానులు నిరాశహపడ్డారు. కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ నుంచి విడాకులు కావాలంటూ ఆయన భార్య సంగీత కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె తమిళనాడులోని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఓ ప్రముఖ నటితో విజయ్ కు అఫైర్ ఉందని సంగీత ఆరోపించింది. దాంతో విజయ్ కు ఆయన ఫాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. గత నెల 24న ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసు విచారణ ఏప్రిల్ 20న జరగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విజయ్ తన భార్యకు రూ.250 కోట్ల భరణం ఇవ్వాలని యోచిస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. విజయ్‌పై రెండో పిటిషన్‌ దాఖలు చేసింది భార్య సంగీత. విడాకుల కేసు ముగిసేవరకు విజయ్‌ ఇంట్లో ఉండటానికి అనుమతి ఇవ్వాలని కోరారు. విజయ్ కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని.. ఆమె విషయంలోనే తమ మధ్య విబేధాలు వచ్చాయని.. ఐదేళ్లుగా మానసిక క్షోభ అనుభవిస్తునట్టు పిటిషన్ లో తెలిపారు. ఆమెతో ప్రేమాయణం నడుపుతూ విజయ్ తనకు నమ్మకద్రోహం చేశారని.. వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఈ వివాదం కోలీవుడ్ లో రచ్చ చేస్తుండటంతో విజయ్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ ఫ్యాన్ నటి సనమ్ శెట్టి సంచలన ఆరోపణలు చేశారు. స్వతహాగా విజయ్ అభిమాని అయిన సనమ్ శెట్టి విజయ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవలే విజయ్, త్రిష కలిసి ఓ పెళ్ళికి హాజరయ్యారు. ఈ వీడియోను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేస్తూ.. ఇది కరెక్ట్‌ కాదు.. భార్య బాధను కొంచం కూడా పట్టించుకోకపోవడం విచారకరం. ఎంతోకాలంగా అభిమానిస్తున్న మాలాంటివాళ్లను మీరు తీవ్రంగా నిరాశపర్చారు అని రాసుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us