Telangana: కొడుకు పెళ్లి ఘనంగా చేయాలనుకున్న తండ్రి.. ఇంతలో ఎదురొచ్చిన మృత్యుశకటం..!
వరంగల్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆగస్ట్ 22వ తేదీన పెళ్లి వేడుక జరగాల్సిన ఇంట్లో ఊహించని విషాదం అలముకుంది. రోడ్డు ప్రమాదంలో వరుడి తండ్రితో సహా అతడి పెదనాన్న కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. భాజా భజంత్రీలు మోడల్స్ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. కన్నకొడుకు పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించాలని ఆరాటపడ్డ ఆ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. RTC బస్సు రూపంలో ఆ తండ్రి ఆయువు మింగేసింది.. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఇద్దరిని బలి […]
వరంగల్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆగస్ట్ 22వ తేదీన పెళ్లి వేడుక జరగాల్సిన ఇంట్లో ఊహించని విషాదం అలముకుంది. రోడ్డు ప్రమాదంలో వరుడి తండ్రితో సహా అతడి పెదనాన్న కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. భాజా భజంత్రీలు మోడల్స్ ఇంట్లో రోదనలు మిన్నంటాయి.
కన్నకొడుకు పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించాలని ఆరాటపడ్డ ఆ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. RTC బస్సు రూపంలో ఆ తండ్రి ఆయువు మింగేసింది.. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఇద్దరిని బలి తీసుకుంది. కుమారుడి పెళ్లి కార్డులు పంచేందుకు అన్న కొడుకుతో కలిసి వెళ్లిన వరుడి తండ్రి, అతని సోదరిని కుమారుడు ఇరువురూ విగతజీవులుగా మారారు. ఈ ప్రమాదం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కోనాయిమాకుల వద్ద జరిగింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులు హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమా మిడిపల్లి గ్రామానికి చెందిన వెంకటనారాయణ, అతని సోదరుని కొడుకు రంజిత్ గా గుర్తించారు. ఆగస్ట్ 22వ తేదీన వెంకటనారాయణ కుమారుడు అశోక్ వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. దుగ్గొండి మండలంలో పెళ్లి పత్రికలు పంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంకటనారాయణ అతని సోదరుని కొడుకు రంజిత్ బైక్ పై స్వగ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న హనుమకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వారి వెనకాలే వస్తున్న పెళ్లికొడుకు అశోక్, తన తండ్రి, సోదరుడు మృతి చెందటంతో షాక్ కు గురయ్యాడు.
స్థానికుల సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఆర్టీసీ బస్సును గీసుకొండ పోలీస్ స్టేషన్ తరలించారు. ఇద్దరి మృత దేహాలను ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.