AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chit Chat Mind Game: తెలంగాణలో సరికొత్త పొలిటికల్‌ ట్రెండ్..! చిట్‌చాట్‌ పేరుతో మైండ్‌గేమ్‌..!

నో అఫిషియల్ రికార్డ్. ఎవరూ మైకుల ముందు మాట్లాడలేదు. అంతా ఆఫ్‌ ది రికార్డే. కానీ, విషయం మాత్రం భయంకరంగా బ్లాస్ట్‌ అయింది. చెప్పాలంటే.. ఇదో కొత్త స్ట్రాటజీ. మైండ్‌గేమ్‌ పాలిటిక్స్‌లో ట్రెండ్‌ సృష్టించబోతోంది.

Chit Chat Mind Game: తెలంగాణలో సరికొత్త పొలిటికల్‌ ట్రెండ్..!  చిట్‌చాట్‌ పేరుతో మైండ్‌గేమ్‌..!
Ktr Revanth Reddy Bandi Sanjay
Balaraju Goud
|

Updated on: Aug 18, 2024 | 9:18 AM

Share

నో అఫిషియల్ రికార్డ్. ఎవరూ మైకుల ముందు మాట్లాడలేదు. అంతా ఆఫ్‌ ది రికార్డే. కానీ, విషయం మాత్రం భయంకరంగా బ్లాస్ట్‌ అయింది. చెప్పాలంటే.. ఇదో కొత్త స్ట్రాటజీ. మైండ్‌గేమ్‌ పాలిటిక్స్‌లో ట్రెండ్‌ సృష్టించబోతోంది. సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆడుతున్న ఈ సరికొత్త గేమ్‌షోపై అంతటా చర్చ జరుగుతోందంటే.. మ్యాటర్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ.. ఏంటా మైండ్‌గేమ్‌ పాలిటిక్స్..?

గీతను చిన్నది చేయాలంటే.. సింపుల్‌గా అటు ఇటు చెరిపేస్తే చాలు. కాని, గీతపై పెద్ద గీతే గీయాలని చెబుతుంటారు పెద్దలు. చెరిపేయడం పెద్ద లెక్క కాదు. అంతకు మించి గీత గీయడంలోనే అసలు నేర్పు. కేటీఆర్‌ చేసింది అదేనా? సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలను ఖండించలేదు. ఆచ్‌తూచ్‌ అనలేదు. మీడియా ముందుకొచ్చో, ఎక్స్‌ వేదికగానో కామెంట్స్‌ చేయలేదు. సింపుల్‌గా.. దానిపైన ఓ పెద్ద గీత గీశారంతే.

మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్‌చాట్‌లో రేవంత్‌రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కీలకం అనేకంటే.. సెన్సేషనల్ కామెంట్స్‌ అనడమే బెటర్. ‘బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం’ అనే పాట కొత్తదేం కాదు. ఆ రెండు పార్టీలకు లింక్‌ కలిపి మాంచి బీట్‌ ఉన్న సాంగ్‌ రిలీజ్‌ చేశారు ఎన్నికలకు ముందు. బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అయిందది. గెలుపు కాంగ్రెస్‌ ఖాతాలో పడింది. ఇప్పుడు అదే పాటను రీమిక్స్‌ చేసి సరికొత్త ట్యూన్‌లో వినిపించారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఇంకాస్త మాస్‌ మసాలా అద్దారంతే. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అవడం ఖాయం అంటూనే.. ఈసారి ఎవరెవరికి ఏయే పదవులు వస్తాయో కూడా చెప్పేశారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గవర్నర్‌ పదవి, కేటీఆర్‌కు కేంద్రమంత్రి పదవి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాలోకి హరీష్‌ రావు రాబోతున్నారంటూ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌కు నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు. ఎలాగూ విలీనం కాబట్టి ఆ నలుగురు ఎంపీలకు బదులుగా కవితకు బెయిల్‌, రాజ్యసభ సీటు దక్కుతుందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని ఇప్పుడు ఖండించినా.. ఎప్పటికైనా జరిగేది ఇదేనంటూ కుండబద్దలు కొట్టారు సీఎం రేవంత్. మీడియాతో చిట్‌చాట్‌ చేసినా.. విషయం భూకంపం పుట్టించేదైతే చాలు.. ఛానెల్స్‌లో బ్రేకింగ్‌ న్యూస్‌లా మారుతుందని సీఎం రేవంత్‌రెడ్డికి బాగా తెలుసు. ఆయన స్ట్రాటజీ గట్టిగానే వర్కౌట్‌ అయింది. రాష్ట్రం మొత్తం ఈ టాపిక్‌పై చర్చోపచర్చలు జరిగాయి.

సాధారణంగా ఇలాంటి బాంబ్‌ బ్లాస్ట్‌ కామెంట్స్ సీఎం రేవంత్‌రెడ్డి నుంచి వస్తే.. వెంటనే అదే స్థాయిలో కౌంటర్ వస్తుంది. కాని, కేటీఆర్ మాత్రం వేరే స్ట్రాటజీ అప్లై చేశారు. ఒక విధంగా రేవంత్‌రెడ్డి వ్యూహంలోనే వెళ్లారు. మీడియాతో చిట్‌చాట్‌ చేస్తూ.. సీఎం రేవంత్, పీఎం మోదీ మధ్య ఓ ఆసక్తికర చర్చ జరిగిందంటూ చెప్పడం మొదలుపెట్టారు కేటీఆర్. ‘తన రాజకీయం పుట్టిందే బీజేపీలో.. రాజకీయ ప్రస్థానం ముగిసేది కూడా బీజేపీలోనే’ అని మోదీతో రేవంత్‌రెడ్డి చెప్పారని కేటీఆర్ చిన్నగా మాటలు వదిలారు. రేవంత్‌రెడ్డి పొలిటికల్ కెరీర్‌ ఎబివిపి నుంచి మొదలైంది కాబట్టి.. చివరకు చేరేది కూడా అదే పార్టీలోకే అని మోదీతో చెప్పుకున్నారట.

ఈ విషయం మీకెలా తెలుసని అడిగితే.. తనకున్న ఢిల్లీ సోర్స్‌ ద్వారా మ్యాటర్‌ తెలిసిందని మీడియా ప్రతినిధులకు చెప్పారు కేటీఆర్‌. ఎబివిపి ద్వారా కాషాయ జెండాతో రాజకీయాల్లోకి వచ్చిన రేవంత్‌.. అదే జెండా కప్పుకుని చనిపోతానని మోదీతో చెప్పారట అని కేటీఆర్‌ ఎక్స్‌ప్లైన్ చేశారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి ఒకరికొకరు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటారని, మోదీతో ఈ విషయం మాట్లాడింది నిజమో కాదో రేవంత్‌ రెడ్డే క్లారిటీ ఇవ్వాలంటూ ఓ ముగింపు ఇచ్చారు. బీజేపీతో రేవంత్‌రెడ్డికి ఉన్న సంబంధాలపై ఆయనే ప్రజలకు క్లారిటీ ఇవ్వాలంటూ చిట్‌చాట్‌ ముగించారు. మొత్తానికి ఇదీ విషయం.

ఇవన్నీ చూస్తున్న బీజేపీ ఊరికే ఉంటుందా..! గత ఎన్నికల్లో డ్యామేజ్‌ జరిగిందే బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనన్న స్లోగన్‌తోనే..! సో, కేంద్రమంత్రి బండి సంజయ్‌ వెంటనే లైన్‌లోకి వచ్చేశారు. రేవంత్, కేటీఆర్‌ చిట్‌చాట్‌కు కౌంటర్‌ ఇస్తూ.. కేసీఆర్‌కే ఏఐసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ పదవి, హరీష్‌రావుకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారంటూ మాట్లాడారు. వాళ్లకు వాళ్లు అంటించుకుంటున్న కాషాయ రంగును.. ఇలా చెరిపేసే ప్రయత్నం చేశారు బండి సంజయ్. కానీ, ఒక్క విషయం చెప్పుకోవాలిక్కడ. కేటీఆర్ ఇచ్చిన సమాధానమే అనుకోండి, చిట్‌చాట్ అనుకోండి.. ఇక్కడ కాంగ్రెస్‌కు, బీజేపీకి ఒకేసారి కౌంటర్‌ ఇచ్చినట్టైంది. వెంటనే బీజేపీ కూడా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఎంతైనా.. ప్రధాని మోదీతో లింక్‌ కలిసింది కదా.. బీజేపీ మైక్‌ ముందుకు రావాల్సిందే..!

మొత్తానికి, ఎవరూ ఊహించని మైండ్‌గేమ్‌ ఇది. కారుకు కాషాయ రంగు పూయాలనుకుంటున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. రివర్స్‌ ఆపరేషన్‌లో భాగంగా రేవంత్‌రెడ్డికే కాషాయ రంగు పులుముతున్నారు కేటీఆర్. ఎబివిపితో రేవంత్‌రెడ్డి రాజకీయ అడుగులు పడ్డాయన్నదీ నిజం. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో బీఆర్ఎస్‌ చాలా క్లోజ్‌గా మూవ్‌ అయిందన్నదీ నిజమే..! సో, బీజేపీతో లింకులు ఉన్నాయని చెబితే.. ప్రజల్లో చర్చ జరుగుతుందని ఇలా డైవర్ట్‌ చేసుకుంటున్నారు ఈ ఇద్దరూ. ఇది మైండ్‌గేమ్‌ అని జనాలకి తెలీదనుకున్నారో ఏమో మరి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..